దళిత యువకుడికి గుండు కొట్టించిన పోలీసులు..సీఎం జగన్ సీరియస్

  • Published By: madhu ,Published On : July 22, 2020 / 06:35 AM IST
దళిత యువకుడికి గుండు కొట్టించిన పోలీసులు..సీఎం జగన్ సీరియస్

దళిత యువకుడికి గుండు కొట్టించిన ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆదేశించారు.

వెంటనే స్పందించిన డీజీపీ…యువకుడిపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్ఐ ఫిరోజ్ షాతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడంతో పాటు…ఎస్ఐని అరెస్టు చేశారు. ఎస్ఐ, కానిస్టేబుళ్లపై సెక్షన్‌ 324, 323, 506 రెడ్‌ విత్‌ 34 ఐపీసీ సెక్షన్‌ 3(1)(5), 3(2)(వి) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ ప్రకారం కేసులు పెట్టారు.

అసలేం జరిగింది ?
2020, జులై 18వ తేదీన మునికూడలి గ్రామం వద్ద ఇసుక లారీ..బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి కాలు విరిగింది. కొంతమంది ఎస్సీ యువకులు లారీని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సమయంలో అటు నుంచి వెళుతున్న మునికూడలి గ్రామ పంచాయతీ..మాజీ సర్పంచ్ భర్త కవల కృష్ణమూర్తి జోక్యం చేసుకున్నాడు.

ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతోంది..లారీని వదిలేయాలని చెప్పాడు. ఆగ్రహానికి గురైన…యువకులు కారు అద్దాలను పగులగొట్టారు. దీనిపై అడప పుష్కరం సీతానగరం పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. గొడవపడిన ఐదుగురు యువకులపై కేసు బుక్ చేశారు. ఈ మేరకు …2020, జులై 20వ తేదీ సోమవారం…ఇన్ ఛార్జీ ఎస్ఐ ఫిరోజ్ షా నిందితుల్లో ఒకరైన ఇండుగుమిల్లి ప్రసాద్ ను పీఎస్ కు తీసుకొచ్చారు. తీవ్రంగా కొట్టారు.

అంతటితో ఆగకుండా..ట్రిమ్మర్ తెప్పించి..ప్రసాద్ గడ్డం, మీసాలు, తల వెంట్రుకలను తొలగించారు. అనంతరం విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దళిత సంఘాలు రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీకి విషయం తెలియచేశాయి. మంత్రులు కూడా ఘటనను ఖండించారు. మంత్రి విశ్వరూప్ రాజమండ్రి ఆసుపత్రిలో బాధితుడు ప్రసాద్ ను పరామర్శించారు.