ఎస్వీబీసీ‌లో పోర్న్ సైట్ కలకలం, శతమానం భవతి వీడియో లింక్ బదులుగా పోర్న్ సైట్ లింక్ పంపిన ఉద్యోగి

ఎస్వీబీసీ‌లో పోర్న్ సైట్ కలకలం, శతమానం భవతి వీడియో లింక్ బదులుగా పోర్న్ సైట్ లింక్ పంపిన ఉద్యోగి

Svbc Channel Employ Big Mistake

svbc channel: తిరుమల శ్రీవెంకటేశ్వర భక్తి చానల్(svbc) లో పోర్న్ సైట్ కలకలం రేగింది. ఎస్వీబీసీ ఉద్యోగి వల్ల ఘోరమైన తప్పు జరిగింది. శతమానం భవతి వీడియో లింక్ బదులుగా పోర్న్ సైట్ లింక్ పంపాడు ఉద్యోగి. దీంతో భక్తుడు షాక్ తిన్నాడు. వెంటనే టీటీడీ ఈవో మెయిల్ కు ఫిర్యాదు చేశాడు.

తక్షణమే టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. ఎస్వీబీసీలో తనిఖీలు చేసింది. పోర్న్ సైట్ లింక్ పంపిన ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్వీబీసీలో పని చేసే కొందరు ఉద్యోగులు పోర్న్ సైట్లు చూడటమే పనిగా పెట్టుకున్నారు. పోర్న్ సైట్లు చూస్తున్న ఐదుగురు ఉద్యోగులను అధికారులు గుర్తించారు. అంతేకాదు, మొత్తం 25మంది ఉద్యోగులు తమ విధులను గాలికి వదిలేసి వీడియోలు చూడటమే పనిగా పెట్టుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఎస్వీబీసీ అధికారులు వారందరిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన చర్చకు దారితీసింది.

శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి భక్తుడు ఎస్వీబీసీకి మెయిల్ చేశాడు. దానికి స్పందించిన ఎస్వీబీసీ ఉద్యోగి ఒకరు.. పోర్న్ సైట్ లింక్ పంపాడు. ఆ లింక్ చూసిన భక్తుడికి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆ భక్తుడు వెంటనే టీటీడీ ఛైర్మన్, ఈవోకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు.

ఎస్వీబీసీ పూర్తిగా భక్తి ఛానల్. భక్తి కార్యక్రమాలు, పూజలు ప్రసారం చేస్తారు. ఎస్వీబీసీని జూలై 7 2008న అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రారంభించారు. తిరుమలలో చేసే రోజువారీ ఆచారాలను, పూజా కార్యక్రమాలను ఇందులో ప్రసారం చేస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. తక్కువ కాలంలోనే ఎస్వీబీసీ భక్తుల మన్నన్నలు పొందింది.