Tammineni Veerabhadram : వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పొత్తు-తమ్మినేని వీరభద్రం హాట్ కామెంట్స్

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పొత్తు పెట్టుకుంటాయన్నారు తమ్మినేని వీరభద్రం. పాలేరు సీటు సీపీఎంకే దక్కుతుందన్నారు. 2023లో పాలేరులో ఎర్రజెండా ఎగురుతుందన్నారు.

Tammineni Veerabhadram : వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పొత్తు-తమ్మినేని వీరభద్రం హాట్ కామెంట్స్

Tammineni Veerabhadram : 2023 ఎన్నికల్లో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పొత్తు పెట్టుకుంటాయన్నారు. పాలేరు సీటు సీపీఎంకే దక్కుతుందన్నారు. 2023లో పాలేరులో ఎర్రజెండా ఎగురుతుందన్నారు. ఇక టీఆర్ఎస్, సీపీఐ నేతలను కలుపుకుని పని చేయాలని సీపీఎం నేతలకు సూచించారు తమ్మినేని వీరభద్రం. పాలేరులో సీపీఎం విజయానికి టీఆర్ఎస్, సీపీఐ సహకరిస్తాయన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు సీటుపై కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు కలిసి అడుగులు వేసే అవకాశాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ్మినేని వీరభద్రం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే ఎన్నికల్లో పాలేరులో ఎర్రజెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొని.. ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఒక్క సీటు వదలకుండా గెలవాలనే తమ ధ్యేయమని అన్నారు. సీపీఎం కార్యకర్తలు రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంలో జరిగిన సభలో.. తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేశారు. పొత్తుల గురించి తమ్మినేని చేసిన కామెంట్స్ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చర్చకు దారితీశాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మునుగోడు ఉపఎన్నికకు ముందు బీజేపీకి చెక్ పెట్టడానికి కేసీఆర్ లెఫ్ట్ పార్టీలతో కలిసి బరిలోకి దిగారు. కేసీఆర్ అంచనాలు నిజమై.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఇకపై లెఫ్ట్ పార్టీ, టీఆర్ఎస్ కలిసి పనిచేయాలని చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బీజేపీకి చెక్ పెట్టేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నల్గొండ జిల్లాలో సీపీఐ, ఖమ్మం జిల్లాలో సీపీఎం కొన్ని సీట్లను అడుగుతోంది. మరి, తమ్మినేని చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.