TDP Bycot : ఎస్ఈసీని తప్పుబడుతూ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ

ఎస్ఈసీ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని విమర్శించారు.

TDP Bycot : ఎస్ఈసీని తప్పుబడుతూ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ

Tdp Bycots All Party Meeting

TDP Bycot : ఎస్ఈసీ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గతంలో ఎస్ఈసీ జవాబుదారితనంగా పనిచేసేవారని, ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగడం లేదని అన్నారు. ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదన్నారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వకముందే మంత్రులు, సీఎం ఎన్నికల తేదీలు ప్రకటించారని విమర్శించారు. ఇవాళ మీటింగ్ పెట్టి నిన్న సాయంత్రమే ఎన్నికల నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎస్ఈసీ ఎందుకు తొందరపడి ఎన్నికలు నిర్వహిస్తోందో చెప్పాలన్నారు. మీరు చేసే అరాచక చర్యలకు మేం మద్దతు తెలపాలా? అని దుయ్యబట్టారు. ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని గత ఎస్ఈసీ గవర్నర్‌కు లేఖ రాశారన్నారు. అఖిలపక్ష సమావేశానికి ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని చంద్రబాబు తప్పుబట్టారు.

నిబంధనలు పక్కనపెట్టి మరీ ఎన్నికలు జరుపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యాన్ని అవమానించారని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికలు నిర్వహించడానికి మీకు అర్హత ఉందా? అని ప్రశ్నించారు. జడ్పీటీసీలు 19శాతం ఏకగ్రీవం కాగా.. రాష్ట్రంలో 24శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయని చంద్రబాబు అన్నారు. స్థానిక ఎన్నికల్లో బలవంతంగా ఏకగ్రీవాలు చేశారని ఆయన ఆరోపించారు. వసూళ్లు చేసిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని అన్నారు. నామినేషన్ వేయనీయకుండా అడ్డుపడి, అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.