AP Women’s Commission : మహిళ కమిషన్‌ విచారణకు చంద్రబాబు, బోండా ఉమా హాజరవుతారా?

విజయవాడ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలని చంద్రబాబు పరామర్శించిన సమయంలో మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఎదురుపడ్డారు. ఆమెను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ మహిళా నేతలు వాసిరెడ్డి పద్మను అడ్డుకునేందుకు యత్నించారు.

AP Women’s Commission : మహిళ కమిషన్‌ విచారణకు చంద్రబాబు, బోండా ఉమా హాజరవుతారా?

Ap Women Commission

Chandrababu and Bonda Uma : చంద్రబాబు, బోండా ఉమ ఏపీ మహిళ కమిషన్‌ ముందు ఇవాళ హాజరుకావాల్సి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, బోండా ఉమ ఏపీ మహిళ కమిషన్‌ ముందు ఇవాళ హాజరుకావాల్సి ఉంది. అయితే విచారణకు రామంటూ స్పష్టం చేశారు టీడీపీ నేతలు. తప్పకుండా రావాల్సిందేని చెప్తున్నారు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. దీంతో టీడీపీ నేతలు కమిషన్‌ ముందు హాజరవకపోతే తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఆసక్తి నెలకొంది.

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌కు జరిగిన అవమానం కోట్లాది మహిళలకు జరిగినట్టు భావించాలన్నారు వాసిరెడ్డి పద్మ. టీడీపీ రాజకీయ పార్టీగా సమాధానం చెప్పాలన్నారు. తప్పు జరిగిందనడానికి చంద్రబాబు సాక్ష్యమన్నారు. సమన్లకు సరైన రీతిలో స్పందించడం లేదన్నారు. బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశించానని….దానికి కూడా అడ్డంగా బుకాయిస్తున్నారని ఫైర్ అయ్యారు వాసిరెడ్డి పద్మ. గౌరవప్రదంగా సమస్యను ముగిస్తారా? లేదా అని ప్రశ్నించారు.

AP Crime : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటనలో సీఐ, ఎస్సై సస్పెన్షన్‌

విజయవాడ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలని చంద్రబాబు పరామర్శించిన సమయంలో మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఎదురుపడ్డారు. ఆమెను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ మహిళా నేతలు వాసిరెడ్డి పద్మను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చంద్రబాబు కూడా అక్కడే ఉన్నారు. టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుపై మహిళ కమిషన్‌ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరవాల్సిందిగా ఆదేశించింది. అయితే టీడీపీ నేతలు రామని స్పష్టం చేయడంతో..ఎలా ముందుకెళ్లాలని కమిషన్ చర్చిస్తోంది.