Chandra babu Naidu : ఆంధప్రదేశ్ ఒకప్పుడు పోటీ .. ఇప్పుడు లూటీ

విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ 14వ స్థానానికి పడిపోయిందని..వైసీపీ నేతల బెదిరింపులతో కమీషన్ల దందాలకు భయపడి ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఏ ఒక్క పెట్టుబడిదారుడు ముందుకు రావటంలేదని అన్నారు.

Chandra babu Naidu : ఆంధప్రదేశ్ ఒకప్పుడు పోటీ .. ఇప్పుడు లూటీ

Chandra babu Naidu

Andhra Pradesh : అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఇతర రాష్ట్రాలతో పోటీ పడేది..కానీ ఇప్పుడు సీఎం జగన్ స్వార్థ రాజకీయాలతో లూటీ జరుగుతోంది అంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ఏపీ ఒకప్పడు దేశంలోని తొలి 5 రాష్ట్రాలతో ఏపీ పోటీ పడేదని ఇప్పుడంతా రాష్ట్రంలో లూటీ జరుగుతోంది అంటూ విమర్శించారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ 14వ స్థానానికి పడిపోయిందని..వైసీపీ నేతల బెదిరింపులతో కమీషన్ల దందాలకు భయపడి ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఏ ఒక్క పెట్టుబడిదారుడు ముందుకు రావటంలేదని అన్నారు.

పెట్టుబడి పెట్టాలంటే ఏ పెట్టుబడిదారుడికైనా నమ్మకం ఉండాలి..కానీ ఏపీ అటువంటి నమ్మకాన్ని ఇవ్వకలేకపోతోంది అందుకే ఏపీకి ఏ పెట్టుబడులు రావటంలేదన్నారు. దేశంలోనే సంపన్న సీఎం జగన్‌ తన సంపద గురించే ఆలోచిస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించటంలేదని విమర్శించారు. జగన్‌కి పెట్టుబడులు, యువత భవిత గురించి అక్కర్లేదు కానీ తన సంపద పెంచుకోవటానికి నిరంతరం యత్నిస్తుంటారని చంద్రబాబు విమర్శించారు.