Chandrababu Naidu: సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ.. వారిపై దాడులు చేసినవాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్

అక్రమ మట్టి తవ్వకాలను ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోంది? దళితులపై దాడి ఘటనలో నిందితులను ప్రభుత్వం ఎందుకు రక్షించాలని చూస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్‌కు రాసిన లేఖలో ప్రశ్నించారు.

Chandrababu Naidu: సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ.. వారిపై దాడులు చేసినవాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్

Chandrababu Naidu

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) లేఖ రాశారు. వైఎస్ఆర్ సీపీ (YSR Congress Party) ప్రజాప్రతినిధులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు లేఖలో ఆరోపించారు. దళితుల భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారని, నిరసన వ్యక్తం చేసిన దళితుల‌పై దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు.

టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఆనం

పశ్చిమగోదావరి (West Godavari)  జిల్లా యలమంచిలి (Yalamanchili) మండలం చించినాడ  (Chichinada) గ్రామానికి చెందిన దళితులు ఏనుగువానిలంక గ్రామంలో 60ఏళ్లుగా వారికి కేటాయించిన అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్నారు. కానీ, దళితులు సాగుచేసుకుంటున్న భూముల్లోకి నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ అనుచరులు వెళ్లి అక్రమ మట్టి తవ్వకాలు చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ తవ్వకాలను నిరసిస్తూ దళితులు ఈ నెల 6న నిరసనకు దిగితే పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారని, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే లాఠీచార్జి చేస్తారా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న దళితులపై పోలీసులు లాఠీ చార్జి చేయడంతోపాటు, నిర్బంధించాల్సిన అవసరం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. అక్రమ మట్టి తవ్వకాలను ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోందని, ఈ ఘటనలో నిందితులను ప్రభుత్వం ఎందుకు రక్షించాలని చూస్తోందంటూ చంద్రబాబు జగన్‌కు రాసిన లేఖలో ప్రశ్నించారు.

Minister Jogi Ramesh: పేదల పక్షాన నిలబడేది జగన్.. పేదలకు మంచి జరిగితే ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు..

పోలీసులు అధికార పార్టీ గుండాల్లా ప్రవర్తిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తుందని చంద్రబాబు వాపోయారు. దళితుల భూముల్లో అక్రమంగా మట్టితవ్వుతున్న వారిని అడ్డుకోవాల్సింది పోయి అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు కొమ్ముకాయటం దుర్మార్గమని అన్నారు. పేదల ఇళ్ల నిర్మాణంకోసం మట్టి తరలింపు అని చెబుతున్నా అక్కడ తవ్విన దాంట్లో 80శాతం మట్టిని ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. గోదావరి నది ఒడ్డున విచక్షణారహితంగా మట్టిని తవ్వడం, భారీ వాహనాలు వెళ్లడం వల్ల నది గట్టు ధ్వసమైందని, గట్టు విధ్వంసం వల్ల ఆకస్మిక వరద ముప్పుకు అవకాశం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ మట్టి తవ్వకాలు,  రవాణాకు పాల్పడుతున్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని, అక్రమ తవ్వకాలను నిలిపివేసి పర్యావరణాన్ని కాపాడాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు.