Chandrababu On BRS : కేసీఆర్ జాతీయ పార్టీపై చంద్రబాబు ఆసక్తికర స్పందన

ఓ మీడియా ప్రతినిధి.. కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందించాలని చంద్రబాబుని కోరారు. దీనికి చంద్రబాబు.. ఓ చిరునవ్వు నవ్వి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. చంద్రబాబు రియాక్షన్ చూసి అక్కడున్న వాళ్లంతా కొంత ఆశ్చర్యపోయారు.

Chandrababu On BRS : కేసీఆర్ జాతీయ పార్టీపై చంద్రబాబు ఆసక్తికర స్పందన

Chandrababu On BRS : తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా జాతీయ పార్టీని అనౌన్స్ చేశారు. టీఆర్ఎస్ ను.. బీఆర్ఎస్ గా (భారత్ రాష్ట్ర సమితి) మార్చేశారు. జాతీయ రాజకీయాల్లోనూ సత్తా చాటుతామని కేసీఆర్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ జాతీయ పార్టీ గురించి చర్చించుకుంటున్నారు. పలు పార్టీల నాయకులు కేసీఆర్ జాతీయ పార్టీపై తమ స్పందన తెలియజేశారు. కొందరు స్వాగతిస్తే, మరికొందరు ఎలా ప్రయోజనం ఉండదంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ జాతీయ పార్టీపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందన ఏంటోనని అంతా ఆసక్తిగా చూశారు.

కాగా, బీఆర్ఎస్ పై స్పందించేందుకు నిరాకరించారు చంద్రబాబు. బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. చివరగా ఓ మీడియా ప్రతినిధి.. కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందించాలని చంద్రబాబుని కోరారు. దీనికి చంద్రబాబు.. ఓ చిరునవ్వు నవ్వి.. ఇప్పుడొద్దులే అన్నట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నవ్వుకుంటూనే స్టేజి దిగి వెళ్లిపోయారు. చంద్రబాబు రియాక్షన్ చూసి అక్కడున్న వాళ్లంతా కొంత ఆశ్చర్యపోయారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

వీలున్నప్పుడల్లా పొలిటికల్ గా ఓ రేంజ్ లో ఫైట్ చేసుకున్న ఇద్దరు నేతలు, కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ పార్టీపై స్పందించేందుకు చంద్రబాబు నిరాకరించడంపై పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ గురించి మనకెందుకులే అని అనుకున్నారా? లేక ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం ఏముందిలే? అని అనుకున్నారో తెలియాల్సి ఉంది.

కాగా, దసరా(అక్టోబర్ 5) పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో పార్టీని అనౌన్స్ చేశారు. టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్ గా కొనసాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. దేశంలో అనేక పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడలా మారిపోయిందని.. తనకు మాత్రం రాజకీయం అనేది ఒక టాస్క్ వంటిదని చెప్పారు గులాబీ బాస్.