Chandrababu Naidu : అంత ఆస్తి ఉన్న జగన్ పేదల ప్రతినిధా? ప్రతి ఇంటికెళ్లి జగన్ చేసే మోసాన్ని వివరించాలి-చంద్రబాబు

ఇంతటి ఆస్తి ఉన్న జగన్ పేదల ప్రతినిధా..? ప్రతి ఇంటికి వెళ్లి.. జగన్ చేసే మోసాన్ని వివరించాలి. సంక్షేమం చేసింది మనమే.(Chandrababu Naidu)

Chandrababu Naidu : అంత ఆస్తి ఉన్న జగన్ పేదల ప్రతినిధా? ప్రతి ఇంటికెళ్లి జగన్ చేసే మోసాన్ని వివరించాలి-చంద్రబాబు

Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంతో ఇప్పటినుంచి మరింత అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలను, కార్యకర్తలను హెచ్చరించారు చంద్రబాబు. ప్రజావేదికను కూలగొట్టిన రోజే జగన్ వైఖరేంటో అర్థమైందన్నారు చంద్రబాబు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అని ధ్వజమెత్తారు. జగన్ చేసిన అవమానాలను ఏపీ ప్రజలు భరిస్తున్నారని చెప్పారు. మా తిక్కల ముఖ్యమంత్రి రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారని చెప్పుకోవాల్సి వస్తోందన్నారు.

Also Read..YCP MLAs: ‘ఆ నలుగురు ఎమ్మెల్యేల’పై సస్పెన్షన్ వేటు.. వెల్లడించిన సజ్జల

టీడీపీ హయాంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి సస్యశ్యామలం చేశామన్నారు చంద్రబాబు. అలాంటిది.. 2019 ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగిందని, ఏపీకి శని పట్టిందని చంద్రబాబు వాపోయారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆగిపోయిందన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని ఆరోపించారు. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్ తరహాలో పోలవరం రూపంలో బ్యారేజ్ కడతారా..? అని ప్రశ్నించారు. టీడీపీ సామర్ధ్యం తెలుసు కాబట్టే పోలవరం నిర్మాణ బాధ్యతలను నీతి ఆయోగ్ మన ప్రభుత్వానికి అప్పజెప్పిందన్నారు చంద్రబాబు. టీడీపీ కంటిన్యూ అయ్యుంటే ఈపాటికే పోలవరం నిర్మాణం పూర్తి అయ్యేదన్నారు.(Chandrababu Naidu)

Also Read..Vishnu Kumar Raju: ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తప్పుచేశారు..! ఈసారి వైసీపీ గెలుపు అసాధ్యం

” వైసీపీ విషయంలో ఇప్పటి నుంచి మరింత అప్రమత్తంగా ఉండాలి. అధికార పార్టీ మరిన్ని ఇబ్బందులు పెడుతుంది. ఎదుర్కోవాలి. బాబాయ్ ని చంపేసి డ్రామాలు ఆడారు. కోడికత్తి డ్రామా పేరుతో ఓట్లు వేయించుకున్నారు. జగన్ ది ధనబలం, టీడీపీది జనబలం. జన బలం ముందు ధనబలం ఆగలేదు. పేదలను దోచుకున్న జగన్.. పేదల ప్రతినిధిగా మాట్లాడుతున్నారు.(Chandrababu Naidu)

దేశంలోని అందరి ముఖ్యమంత్రులకున్న ఆస్తి కంటే జగన్ ఆస్తి ఎక్కువ. ఇంతటి ఆస్తి ఉన్న జగన్ పేదల ప్రతినిధా..? ప్రతి ఇంటికి వెళ్లి.. జగన్ చేసే మోసాన్ని వివరించాలి. సంక్షేమం చేసింది మనమే. పట్టభద్రుల్లో తిరుగుబాటు వచ్చింది. దాని ఫలితమే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు. ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ప్రజల తీర్పు వచ్చింది. ఇక్కడ కూడా ఎన్నికల ఏకపక్షమే. రంజాన్ తోఫా ఇప్పుడు ఉందా..? పేద ముస్లింలను అన్ని రకాలుగా ఆదుకున్నాం” అని చంద్రబాబు అన్నారు.(Chandrababu Naidu)

Also Read..Vallabaneni Vamshi: మా ఎక్స్‌ బాస్‌ కొనుగోలు విషయంలో ఎక్స్‌పర్ట్.. ప్రజాక్షేత్రంలో వైసీపీదే విజయం

జోన్-3 టీడీపీ ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు కాళ్లకు నమస్కరించారు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయాన్ని చంద్రబాబు విజయంగా, టీడీపీ కుటుంబ విజయంగా ఆమె అభివర్ణించారు. చంద్రబాబు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అనురాధ చెప్పారు.