Chandrababu Burnt GO.no.1 Papers : భోగి మంటల్లో జీవో నెం.1 కాపీలను దగ్ధం చేసిన చంద్రబాబు

ఏపీలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో భోగి వేడుకలు జరుపుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో భోగి సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు.

Chandrababu Burnt GO.no.1 Papers : ఏపీలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో భోగి వేడుకలు జరుపుకుంటున్నారు. భోగి మంటల్లో జీవో నెంబర్ 1 కాపీలు వేసి దహనం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో భోగి సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. శ్రీకాకుళంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు భోగి మంటల్లో జీవో నెంబర్ 1 కాపీలను వేసి దహనం చేశారు. గుంటూరులో ఆలపాటి రాజా భోగి మంటల్లో జీవో నెంబర్ 1 కాపీలను వేసి దగ్ధం చేశారు. ఏలూరులోని దెందులూరులో చింతమనేని ప్రభాకర్ భోగి మంటల్లో జీవో నెం.1 కాపీలు వేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డిని హెచ్చరిస్తున్నా.. పెద్దిరెడ్డి ఆకృత్యాలను చూసీచూడనట్లు ఉండటం వల్లే ఇలా తయారయ్యారని పేర్కొన్నారు. జిల్లాలకు పెద్దిరెడ్డి భారం అయ్యారని విమర్శించారు. పుంగనూరులో 40 రోజుల్లో 10 ఎఫ్ ఐఆర్ లతో 100 మందిని అరెస్టు చేశారని చెప్పారు. తమ వాళ్లకు పండుగ లేకుండా చేశారని మండిపడ్డారు. ఇప్పటివరకు తన మంచితనం చూశారని.. ఇకపై తన కఠినత్వం చూస్తారు.. వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు. మధ్యంతర ఎన్నికలు పెట్టినా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు.

Bhogi Festival : తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి.. తెల్లవారుజాము నుంచే చలి మంటలు

పుంగనూరుతోపాటు 175 నియోజకవర్గాలు మనం గెలవాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. టీటీడీ అద్దె గదులు పెంచారు.. ప్రసాదాల నాణ్యత తగ్గిందన్నారు. రేట్లు పెంచి వ్యాపారం చేయొద్దని.. దేవుడు ఎవరినీ వదలడని పేర్కొన్నారు. పవన్ సభ పెడితే వైసీపీ నేతలు సైకో రేసు కుక్కల్లా మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. సీఎం పక్కన ఉండే గ్యాంగ్ అంతా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీని పనికిమాలిన రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.

తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసుకుంటూ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. భోగితో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజైన భోగి ప్రత్యేకమైంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నాయకులు భోగి సంబరాలు జరుపుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు