వైసీపీ గుర్తింపు రద్దు చేయండి, ఈసీకి TDP ఫిర్యాదు

'ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8(ఏ) 9(ఏ) 10(ఏ) మరియు 123 సెక్షన్లను వైసీపీ ఉల్లంఘించింది. వైసీపీని రాజకీయ పార్టీగా గుర్తించకుండా రద్దు చేయాలి. వైసీపీ పూర్తిగా అవినీతి, నేరమయ కార్యకలా

వైసీపీ గుర్తింపు రద్దు చేయండి, ఈసీకి TDP ఫిర్యాదు

Tdp

TDP : వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు తెలుగు దేశం పార్టీ నేతలు. ఈ మేరకు ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అధికార పార్టీ దాడులు చేస్తోందన్నారు. గంజాయి సహా రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావిస్తే అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వైసీపీ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ఫిర్యాదుపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ ఇచ్చిందని టీడీపీ నేతలు తెలిపారు.

Elon Musk To WFP : రూ. 45వేల కోట్లు ఇస్తా..ఆకలి సమస్య తీర్చగలరా?

”ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8(ఏ) 9(ఏ) 10(ఏ) మరియు 123 సెక్షన్లను వైసీపీ ఉల్లంఘించింది. వైసీపీని రాజకీయ పార్టీగా గుర్తించకుండా రద్దు చేయాలి. వైసీపీ పూర్తిగా అవినీతి, నేరమయ కార్యకలాపాలలో మునిగిపోయింది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. అక్రమ మార్గాలతో సంపాదించిన డబ్బుతో మీడియా సంస్థలను స్థాపించడంతోపాటు రాజకీయ పార్టీ స్థాపించడానికి ఉపయోగించారు. మీడియా ద్వారా తప్పుడు ప్రచారంతో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్య సంస్థలు, రాజ్యాంగ సంస్థలపై దాడులు ప్రారంభమయ్యాయి.

Exercise : క్యాన్సర్ రోగులు వ్యాయామాలు చేయటం మంచిదేనా?..

ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ హబ్ గా మారింది. ప్రాథమిక హక్కులను పూర్తిగా ఉల్లంఘించడంతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు జీవితాలు మరియు ఆస్తులపై దాడులు జరిగాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేశారు” అని టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఏపీని ఇప్పటికే గుండా, రౌడీ రాజ్యంగా మార్చారని, తాజాగా డ్రగ్స్ హబ్ గా మార్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. గతంలో పంజాబ్ లో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని అనేవారని, ఇప్పుడు ఏపీ డ్రగ్స్ అడ్డాగా మారిందన్నారు. దొంగే దొంగను దొంగ దొంగ అన్నట్టుగా వైసీపీ తీరందని మండిపడ్డారు.