Raavi Venkateswara Rao : కొడాలి నాని విశాఖలో వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టాడు- టీడీపీ నేత సంచలన ఆరోపణలు

మాజీమంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో కొడాలి నాని వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టాడని, ఎంపీ విజయసాయి రెడ్డి చేసే ప్రతి దోపిడీలో కొడాలి నానికి వాటా ఉందని ఆయన ఆరోపించారు. కొడాలి నాని పెట్టుబడులపై తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.

Raavi Venkateswara Rao : కొడాలి నాని విశాఖలో వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టాడు- టీడీపీ నేత సంచలన ఆరోపణలు

Raavi Venkateswara Rao : చంద్రబాబు, బాలకృష్ణను టార్గెట్ చేస్తూ మాజీమంత్రి కొడాలి నాని చేసిన తీవ్ర విమర్శలు దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోటుదారుడు, 420 అన్న కొడాలి నాని.. సిగ్గుందా? అంటూ బాలకృష్ణపైనా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, బాలకృష్ణను ఉద్దేశించి కొడాలి నాని చేసిన ఘాటు వ్యాఖ్యలకు.. టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. కొడాలి నాని టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. గుట్కా నాని అని ఏకిపారేస్తున్నారు. కొడాలి నానిపై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

మాజీమంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో కొడాలి నాని వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టాడని, ఎంపీ విజయసాయి రెడ్డి చేసే ప్రతి దోపిడీలో కొడాలి నానికి వాటా ఉందని ఆయన ఆరోపించారు. కొడాలి నాని పెట్టుబడులపై తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఏ అర్హతతో కొడాలి నాని ఎన్టీఆర్ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని రావి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. బాలకృష్ణ గాలిగోటికి కూడా కొడాలి నాని పనికిరారని విమర్శించారు. హరికృష్ణ పేరు చెప్పి కొడాలి నాని లక్షలు దోచుకున్నారని రావి వెంకటేశ్వరరావు ఆరోపణలు చేశారు. కొడాలి నానిని నెహ్రూ చౌక్ సెంటర్ లో పాతేస్తానని వార్నింగ్ ఇచ్చారు రావి. గుడివాడ ప్రజలు కొడాలి నానికి చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

”కొడాలి నాని ఓ దుర్మార్గుడు. అతడు చేసే దుర్మార్గాలు, అరాచకాలు, దోపిడీలు అన్నింటిని ఎండగడతా. లక్షల కోట్లు దోచుకుంటున్నాడు. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి చంద్రబాబుని తిడుతున్నాడు. భువనేశ్వరిని తిడుతున్నాడు. చివరికి బాలకృష్ణను కూడా వదల్లేదు. కొడాలి నాని అసలు బాలకృష్ణ గాలి గోటికి కూడా పనికిరాడు. బాలకృష్ణకు అభిమానం, ఫాలోయింగ్ చాలా ఎక్కువ. వాళ్లు తలుచుకుంటే నువ్వు గుడివాడ వదిలేసి పారిపోవాల్సి వస్తుంది” అని కొడాలి నానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రావి వెంకటేశ్వరరావు.