స్థానిక సమరం : ఇలా చేస్తే టీడీపీ గెలుపు పక్కా

పరువు కాపాడుకోవాలంటే సత్తా చూపించాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మరచిపోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే. విశాఖ జిల్లా టీడీపీ టార్గెట్

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 12:17 PM IST
స్థానిక సమరం : ఇలా చేస్తే టీడీపీ గెలుపు పక్కా

పరువు కాపాడుకోవాలంటే సత్తా చూపించాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మరచిపోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే. విశాఖ జిల్లా టీడీపీ టార్గెట్

పరువు కాపాడుకోవాలంటే సత్తా చూపించాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మరచిపోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే. విశాఖ జిల్లా టీడీపీ టార్గెట్ ఇదే. జిల్లాలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న కేడర్‌ను ఉపయోగించుకుంటే గ్యారెంటీగా గెలవొచ్చని లెక్కలేస్తోంది. ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరుగుతాయో లేవో తెలియదు గానీ.. టీడీపీ అయితే పక్కా ప్లాన్‌తో రెడీ అయిపోతోంది.

తెలుగు తమ్ముళ్లు జోరు పెంచారు. స్థానిక ఎన్నికలు గెలుపే ధ్యేయంగా పని చేయాలని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అవమానాల్ని సీరియస్‌గా తీసుకున్న తముళ్లు.. దమ్ము చూపేందుకు ముందుగానే రెడీ అవుతున్నారు. ఈ మధ్య మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు అరెస్టు వారెంట్లు ఇచ్చారు. దీంతో ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న అయ్యన్న.. విశాఖ జిల్లాలో ఎలా అయినా టీడీపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని డిసైడ్‌ అయ్యారు. జిల్లాలోని ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి స్థానిక సంస్థలకు ఎన్నికలకు సిద్ధం కావాలని, గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని సూచించారు. జిల్లాలో తన పవర్ చూపేందుకు ఇప్పటికే జట్లను సైతం సిద్ధం చేశారట.

 

ayyanna

ముందుగానే చైర్‌పర్సన్‌ అభ్యర్థి పేరు ప్రకటించాలని నిర్ణయం:
జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి పేరును ఎన్నికల కన్నా ముందే ఖరారు చేయాలని టీడీపీ భావిస్తోంది. జడ్పీ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి పేరును ముందుగా ప్రకటిస్తే జడ్పీటీసీ అభ్యర్థులు చైర్‌ పర్సన్ గెలిపించేందుకు కృషి చేస్తారని ఆశిస్తోంది. వైసీపీ అధిష్ఠానం ఆ పార్టీ అభ్యర్థులకు భారీగా నిధులు సమకూర్చుతుందని భావిస్తున్న తముళ్లు… ఆర్థికంగా నిలబడేందుకు సిద్ధమవుతున్నారట. జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల అభిప్రాయాలు తెలుసుకోవాలని కూడా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారికే ప్రాధాన్యం ఇచ్చి, పేర్లు ఎంపిక చేసి అధిష్ఠానానికి పంపాలని భావిస్తున్నారు.

పదవులన్నీ గిరిజనులకే దక్కేలా చూడాలని డిమాండ్‌:
మరోవైపు ఏజెన్సీలో ఒక్క జడ్పీటీసీని కూడా ఎస్టీలకు రిజర్వు చేయలేదని, పైగా నాలుగు స్థానాలను బీసీలకు కేటాయించారని, దీనివల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుందని టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. షెడ్యూల్డ్ ప్రాంతం అయినందున ఏజెన్సీలో పదవులన్నీ గిరిజనులకే దక్కేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అంటున్నారు. జనసేన సైతం స్థానిక పోరుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర స్థాయిలో బీజేపీతో పొత్తు ఖరారు చేసుకున్న జనసేన.. ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. పంచాయతీ స్థాయిలోకి పార్టీని తీసుకెళ్లి బలోపేతం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలంటే సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థుల అన్వేషణలో పడ్డాయంటున్నారు. అధికార పార్టీ వైసీపీ మాత్రం గెలుపుపై పూర్తి స్థాయి ధీమా వ్యక్తం చేస్తోంది.

pawan

బీజేపీతో కలవడం జనసేకు ప్లస్ అవుతుందా?
నిజానికి కొద్ది రోజుల క్రితం వరకూ స్థానిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఒక అండర్‌ స్టాండింగ్‌కు వచ్చి పోటీ చేయాలని అనుకున్నాయట. స్థానిక నేతలు కూడా ఈ దిశగా మంతనాలు సాగించారంటున్నారు. అయితే, ఈ ప్లాన్‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బ్రేకులు వేసేశారు. ఆయన రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్లాలని డిసైడ్‌ అవ్వడంతో ఇప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి సాగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి తెలుగుదేశంతో కలిసి వెళ్తేనే ప్రయోజనం ఉంటుందని స్థానిక జనసేన నాయకులు భావిస్తున్నారట. కానీ, ఇప్పుడేం చేయలేని పరిస్థితుల్లో బీజేపీతో కలసి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. మరి ఈ కలయికతో ఎలాంటి ఫలితాలు వస్తాయో ఎదురు చూడాల్సిందేనని అంటున్నారు.

Also Read : మళ్లీ పాత ఉడా..? : రాజధాని లేనప్పుడు CRDA ఎందుకు