ఆత్మహత్యాయత్నానికి ముందు టీడీపీ నేత అవినాశ్ సెల్ఫీ వీడియో 

టీడీపీ నేత అవినాశ్ ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి కొద్ది నిమిషాల ముందు అవినాశ్ తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.

  • Published By: veegamteam ,Published On : March 6, 2020 / 11:59 AM IST
ఆత్మహత్యాయత్నానికి ముందు టీడీపీ నేత అవినాశ్ సెల్ఫీ వీడియో 

టీడీపీ నేత అవినాశ్ ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి కొద్ది నిమిషాల ముందు అవినాశ్ తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.

టీడీపీ నేత అవినాశ్ ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి కొద్ది నిమిషాల ముందు అవినాశ్ తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పై నుంచే వీడియో రికార్డ్ చేశాడు. పోలీసుల వేధింపుల వల్లే ప్రాణం తీసుకోవాలనుకుంటున్నానని అవినాశ్ చెప్పాడు. 

ఎస్ ఎమ్ పురంలో శివాలయం నిర్మాణ విషయంలో వివాదం తలెత్తింది. మూడున్నరేళ్లుగా అవినాశ్ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయం దగ్గరకు రావొద్దంటూ పోలీసులు అడ్డుపడ్డారని అవినాశ్ ఆరోపణ చేశారు. శ్రీకాకుళం జిల్లా జడ్పీ మాజీ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ కుమారుడు అవినాశ్. అవినాశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో అతనికి చికిత్స కొనసాగుతోంది. 

పోలీసుల వేధింపులు తట్టుకోలేక శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఎస్ ఎమ్ పురంలో అవినాశ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసు స్టేషన్‌ రెండవ అంతస్తు పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తన తండ్రి చౌదరి బాబ్జీపై తనపై వైసీపీ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఈ చర్యకు పాల్పడ్డాడు. (పోలీస్ స్టేషన్ పై నుంచి దూకి టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం)

ఎడ్చెర్ల పోలీస్ స్టేషన్ రెండవ అంతస్తు పైనుంచి దూకగా.. అవినాశ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా.. ఈ రకమైన చర్యలకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చౌదరి అవినాశ్, చౌదరి బాబ్జీపై పోలీసులు మూడు కేసులు పెట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. కేసులు విచారణ జరుగుతుందని, వేధించలేదని డీఎస్పీ అంటున్నారు.  

అయితే ప్రతి గొడవకు అవినాశ్‌ని భాద్యున్ని చేస్తూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేధిస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఎస్సై రాజేష్ తనను వేధిస్తున్నారంటూ అవినాష్ తీవ్ర మనస్థాపం చెందాడని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో ఎస్‌ఎంపురం సర్పంచ్‌గా కూడా అవినాష్ పనిచేశాడు. పోలీసులు తీరుపై జిల్లా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.