Batchula arjunudu: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇవాళ తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గుండెనొప్పి రావడంతో విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. బచ్చుల అర్జునుడికి బీపీ అధికంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

Batchula arjunudu: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇవాళ తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గుండెనొప్పి రావడంతో విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. బచ్చుల అర్జునుడికి బీపీ అధికంగా ఉంది.
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మరో 24 గంటలు గడిచాక మరోసారి పరిస్థితిని సమీక్షించనున్నట్లు వివరించారు. బచ్చుల అర్జునుడు 2017లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయిన విషయం తెలిసిందే. ఆయన స్వస్థలం మచిలీపట్నం. గతంలో ఆయన మచిలీపట్నం మునిసిపాలిటీ ఛైర్మన్ గానూ పని చేశారు.
2014లో ఆయన కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ ఛైర్మన్ గానూ ఉన్నారు. బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తెలుసుకుని కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు వస్తున్నారు. ఇటీవలే బచ్చుల అర్జునుడు టీడీపీ నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.
Peru Accident: పెరూలో ఘోర బస్సు ప్రమాదం.. 24 మంది మృతి