Andhra Pradesh : వైసీపీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్

నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికు అఖిల ప్రియ సవాల్ విసిరారు.నంద్యాల గాంధీ చౌక్ కు వద్దకు బహిరంగ చర్చకు రావాలి అంటూ సవాల్ విసిరారు. దీంతో కర్నూలు పోలీసులు అఖిల ప్రియను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Andhra Pradesh : వైసీపీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్

Bhuma Akhila Priya house arrest

Andhra Pradesh : ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో లుకలుకలు..పార్టీపై అసంతృప్తులు పెరిగిపోతున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి, ఆనం ఇద్దరు నిరసనగళాలు వినిపించి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న వేళ..కర్నూలు జిల్లాలో వైసీపీ నేతలు కూడా టీడీపీవైపు చూస్తున్నారా? అంటే నిజమేనంటున్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలవరాన్ని కలిగిస్తున్నాయి.

ఇదిలా ఉంటే నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికు అఖిల ప్రియ సవాల్ విసిరారు.శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి చేసిన అక్రమాలు బయటపెడతానని..దమ్ముంటే శిల్పా నంద్యాల గాంధీ చౌక్ కు వద్దకు బహిరంగ చర్చకు రావాలి అంటూ సవాల్ విసిరారు. దీంతో కర్నూలు పోలీసులు అఖిల ప్రియను హౌస్ అరెస్ట్ చేశారు. నంద్యాల గాంధీ చౌక్ కు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఆమె ఇంటినుంచి బయటకు రాకుండా ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.దీంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా..వైసీపీలో ఇక తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గ్రహించిన శిల్పా టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు అఖిలప్రియ. అంతేకాదు ఫిబ్రవరి 4న నంద్యాల గాంధీ చౌక్ వద్దకు వస్తే శిల్పా చేసిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని సవాల్ విసిరారు. అంతేకాకుండా శిల్పా నాపై చేసిన ఆరోపణలను కూడా నిరూపించాలని..లేదంటే తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చాలెంజ్ చేశారు. దీంతో అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.