Pattabhi Ram : ఎన్ హెచ్ ఆర్ సీకి టీడీపీ నేత పట్టాభి రామ్ ఫిర్యాదు

జాతీయ మానవ హక్కుల కమిషన్ ను టీడీపీ నేత పట్టాభి రామ్ కుటుంబ సమేతంగా కలిశారు. ఏపీలో పరిస్థితులు, పోలీసులు తనపై జరిపిన దాడిపై ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు రాజీవ్ జైన్ ను కలిశారు.

Pattabhi Ram : ఎన్ హెచ్ ఆర్ సీకి టీడీపీ నేత పట్టాభి రామ్ ఫిర్యాదు

Pattabhi Ram

Pattabhi Ram : జాతీయ మానవ హక్కుల కమిషన్ ను టీడీపీ నేత పట్టాభి రామ్ కుటుంబ సమేతంగా కలిశారు. ఏపీలో పరిస్థితులు, పోలీసులు తనపై జరిపిన దాడిపై ఎన్ హెచ్ ఆర్ సీకి ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు రాజీవ్ జైన్ ను కలిశారు. గన్నవరంలో జరిగిన అప్రాజస్వామిక దాడి, వాహనాల తగలబెట్టడం ధ్వంసం, పార్టీకి చెందిన అనేకమంది నాయకులను చట్ట విరుద్ధంగా అరెస్టు చేయడంపై మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారుు. కార్యకర్తలను కొట్టారని, తనను ఫిజికల్ టార్చర్ చేశారని ఆరోపించారు. జరిగిన సంఘటనలపై జిల్లా ఎస్పీ జాషువా, ఆయన కింద పని చేసిన అధికారులు తమపై దాడి చేస్తుంటే ఎక్కడ కూడా అదుపు చేయకుండా తమను అరెస్టు చేశారని పేర్కొన్నారు.

తోట్లవల్లూరు స్టేషన్ లో ముగ్గురు చేత 30 నిమిషాల పాటు భౌతికంగా హింసించారని ఆరోపించారు. తనను అరెస్టు చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా చేశారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. జరిగిన అన్ని సంఘటనలను కమిషన్ సభ్యుడు రాజీవ్ జయంతికి వివరించానని చెప్పారు. టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి భౌతికంగా ఏ విధంగా ఇబ్బందుల గురి చేస్తున్నారా అంశాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. రాష్ట్రంలో దిగజారిపోయిన పరిస్థితుల పట్ల విచారం వ్యక్తం చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారని పేర్కొన్నారు.

TDP Leader Pattabhi : టీడీపీ నేత పట్టాభికి ఊరట.. బెయిల్ మంజూరు, కస్టడీ పిటిషన్ కొట్టివేత

చర్యలు తీసుకుంటామని కమిషన్ సభ్యుడు తమకు భరోసా కల్పించారని చెప్పారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ తరపున ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి అమలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇటువంటి దాడులకు, అరెస్టులకు భయపడే పరిస్థితి లేదన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఉన్న అన్ని హక్కులను ఉపయోగించుకుంటామని చెప్పారు. ఏ స్థాయిలో ఉన్న అధికారులను ఎవర్ని సైతం విడిచి పెట్టే పరిస్థితి లేదన్నారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను ఏ రోజు భయపడనని, వెనక్కి పోయే వ్యక్తిని కాదు, పోరాటం చేస్తానని తెలిపారు. ధర్మ పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు.

రాష్ట్ర డిజిపికి జాతీయ మానవ హక్కుల కమిషన్ లేఖ రాస్తామని చెప్పారు. గన్నవరంలో జరిగిన సంఘటనలపై జాతీయ మానవ హక్కు కమిషన్ కు పిర్యాదు చేశామని తెలిపారు. అధికారులు ఎవరు కూడా చట్టానికి అతితులు కాదని, వారిపై చర్యలు తప్పవు అని అన్నారు. వైసీపీపై సెక్షన్లు అమలు చేయొద్దని.. ఐపీసీ సెక్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోచేతి నీళ్లు తాగుతూ అమ్ముడు పోయిన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.