Files Theft Case in Nellore Court : కోర్టులో ఫైల్స్ చోరీ కేసు : ముద్దాయే సీబీఐ విచారణ కోరటం హాస్యాస్పదంగా ఉంది : మంత్రి కాకాణిపై సోమిరెడ్డి సెటైర్లు

నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ కేసు విషయంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కోర్టులో ఫైల్స్ చోరీ కేసు విషయంలో కాకాణి అన్ని అబద్దాలు చెబతున్నారని ఈ చోరీపై ముద్దాయిగా ఉన్నా కాకాణికే సీబీఐ విచారణ కోరటం హాస్యాస్పదం అంటూ ఎద్దేవా చేశారు.

Files Theft Case in Nellore Court :  కోర్టులో ఫైల్స్ చోరీ కేసు : ముద్దాయే సీబీఐ విచారణ కోరటం హాస్యాస్పదంగా ఉంది : మంత్రి కాకాణిపై సోమిరెడ్డి సెటైర్లు

somireddy, kakani govardhan reddy

Files Theft Case in Nellore Court : నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ కేసు విషయంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కోర్టులో ఫైల్స్ చోరీ కేసు విషయంలో కాకాణి అన్ని అబద్దాలు చెబతున్నారని ఈ చోరీపై ముద్దాయిగా ఉన్నా కాకాణికే సీబీఐ విచారణ కోరటం హాస్యాస్పదం అంటూ ఎద్దేవా చేశారు.ముద్దాయే సీబీఐ విచారణ కోరితే సీబీఐ విచారణ చేపడుతుందా? అలా జరగదు అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు. నకిలీ పత్రాల కేసులో సహచరులు జైలుకెళ్తే కాకాణి బెయిల్ తెచ్చుకున్నారని ఓ ముద్దాయి అడిగితే సీబీఐ విచారణ జరగదని మంత్రి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు…రిటైర్ అయిన అధికారుల స్థలాన్ని కాజేశారు అంటో విమర్శించారు. సీబీఐ విచారణ ఎవరు ఆదేశిస్తే జరుగుతుందో కూడా మంత్రికి అవగాహన లేదని విమర్శించారు. కాకాణి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మూడో రోజే నెల్లూరు కోర్టులో పత్రాల చోరీ జరిగిందని సోమిరెడ్డి ఆరోపించారు.పారిశ్రామిక భూములను అక్రమంగా తవ్వేశారని..కాకాణికి నిజంగా నైతిక విలువలు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

ఈ కేసు చూస్తుంటే ఢిల్లీలో ఉపహార్ కేసు గుర్తుకొస్తుందని.. ఉపహార్ కేసు విచారణకు వచ్చినపుడు ముద్దాయిలు ఇద్దరు కేసుకు సంబంధించిన పేపర్లపై ఇంకు పోశారు అనే విషయాన్ని ఈ సందర్భంగా సోమిరెడ్డి గుర్తు చేశారు. ఇలా వారు చేయటం వల్లే అసలు కేసులో ముద్దాయిలకు న్యాయమూర్తి జైలు శిక్ష విధించారని..సోమిరెడ్డి గుర్తుచేశారు.

కోర్టులో ఫైళ్లు చోరీ చేయాల్సిన అసవరం కాకాణికి తప్ప ఇంకెవరికి లేదని..సోమిరెడ్డి స్పష్టం చేశారు. మంత్రి అయినా చేయించాలి లేదా మంత్రి తరఫున ఎవరైనా చేసి ఉండాలని ధీమాగా చెప్పారు సోమిరెడ్డి. మంత్రి కాకాణి కోసం తప్పుడు పత్రాలను తయారుచేసిన వాళ్లేమో జైలులో ఉంటే, మంత్రి మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారంటూ మండిపడ్డారు సోమిరెడ్డి. ఇలా నేరాలు చేసినవారికి మంత్రి పదవులు కట్టబెట్టారని ఇదే వైసీపీ ప్రభుత్వం తీరు అంటూ ఎద్దేవా చేశారు.

కాగా..సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి గతంలో ఆరోపించారు. దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా బయటపెట్టారు. కానీ ఇవి నకిలీవి అనే అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని సోమిరెడ్డి నిరూపించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కాకాణిపై పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణిపై చార్జిషీట్ ఫైల్ చేయటం..ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి నెల్లూరు కోర్టులో విచారణ జరుగుతుండగా.. కోర్టులో డాక్యుమెంట్ల చోరీ జరటం పెను సంచలన సృష్టించింది.