Ganta Srinivasa Rao : జగన్‌కి ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది, వైసీపీ పతనానికి ఇది ఆరంభం- గంటా శ్రీనివాసరావు

హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకూ ఒకటే గాలి వీచిందన్నారు. వైసీపీ పతనానికి ఇది ఆరంభం అన్నారాయన.(Ganta Srinivasa Rao)

Ganta Srinivasa Rao : జగన్‌కి ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది, వైసీపీ పతనానికి ఇది ఆరంభం- గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయంపై ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. టీడీపీ పడిలేచిన కెరటం అన్నారు. దేవుడు చక్కగా స్క్రిప్ట్ ఇచ్చాడని, 23 సంఖ్య తమకు కలిసివచ్చేటట్లు చేశాడని చెప్పారు. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకూ ఒకటే గాలి వీచిందన్నారు.

టీడీపీకి ఆకర్షణ పెరిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్ అని వైసీపీ నేతలే అన్నారని, ఆ లెక్కన సెమీస్ లో ఓడిపోతే ఇక ఫైనల్స్ లో స్ధానం ఉండదన్నారు గంటా శ్రీనివాసరావు. వైసీపీకి ఇది తీవ్రమైన ప్రతికూల ఫలితాలు అని అభివర్ణించారు. జగన్ కి ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయిందని స్పష్టమైన తీర్పునకు ఇది సంకేతం అన్నారు గంటా. వైసీపీ పతనానికి ఇది ఆరంభం అన్నారాయన.

Also Read..TDP 23 Number : డేట్ 23, ఎమ్మెల్యేలు 23, ఓట్లు 23.. నెగిటివ్ నెంబర్‌ను లక్కీ నెంబర్‌గా మార్చుకున్న టీడీపీ

”ఎక్కడా సౌండ్ లేకుండా వైసీపీకి రౌండ్ పడింది‌‌. ఎమ్మెల్సీ అనూరాధను గెలిపించారు. సీనియర్ మినిస్టర్లను ఉపయోగించి మాక్ పోలింగ్ నిర్వహించినా ఫలితం లేకపోయింది. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రతో వరుసగా విజయాలే వస్తున్నాయి” అని గంటా అన్నారు.(Ganta Srinivasa Rao)

విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్..
”108 నియోజకవర్గాల నుంచి గ్రాడ్యుయేట్లు పెద్ద ఎత్తున పాల్గొని టీడీపీని గెలిపించారు. వైసీపీలో ఉన్న వారు కూడా నేడు టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు‌‌. 23 తేదీన 23 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ గెలవడం ఒక సందేశం. నియంతలా పాలించారు కాబట్టే జగన్ ను సాగనంపడానికి అందరూ చూస్తున్నారు‌‌.”

Also Read..Chandrababu : వచ్చే ఎలక్షన్స్ జగన్ పర్సెస్ పబ్లిక్.. ఇక ఏ ఎన్నికల్లోనూ గెలవడు : చంద్రబాబు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన ఫలితం వచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ అనూహ్య విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలుపొందారు. వైసీపీ కచ్చితంగా 7కు 7 ఎమ్మెల్సీ సీట్లు నెగ్గాల్సిన చోట టీడీపీ ఒక సీటు గెలిచింది.

టీడీపీకి 19మంది ఎమ్మెల్యేల మద్దుతు మాత్రమే ఉంటే.. 23 ఓట్లు రావడం విశేషం. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు టీడీపీకి పడినా.. తమదే విజయం అని వైసీపీ ధీమా వ్యక్తం చేసింది. అయితే, అనూహ్యంగా మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేశారు.(Ganta Srinivasa Rao)

గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నే ఓట్లు వచ్చాయి. వాస్తవానికి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వెళ్లారు. గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన మద్దాలి గిరి, విశాఖ సౌత్ నుంచి గెలిచిన వాసుపల్లి గణేశ్, చీరాల నుంచి గెలిచిన కరణం బలరాం.. ఈ నలుగురూ టీడీపీ టికెట్ మీద గెలిచి, ఆ తర్వాత రెబెల్స్ గా మారి, వైసీపీకి దగ్గరయ్యారు.

అయితే, ఈ నలుగురూ వైసీపీకి ఓటేశారా? ఎవరూ ఊహించనిరీతిలో సొంత పార్టీకే ఓటు వేశారా? అన్నది తేలాల్సి ఉంది. అసెంబ్లీలో టీడీపీకి ఉన్న సీట్ల సంఖ్యే.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధకు వచ్చాయి. అంటే, వాళ్ల ఓట్లు వాళ్లకే పడ్డాయి. అయితే, వైసీపీ రెబెల్స్ టీడీపీకి ఓటు వేశారా? లేక సొంత పార్టీలో రెబెల్స్ గా ముద్రపడిన వారే టీడీపీకి ఓటువేశారా అన్నది తెలియాల్సి ఉంది.

ఇక్కడే చంద్రబాబు వ్యూహం ఫలించింది. ఎందుకంటే, ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని చంద్రబాబు నిలబెట్టడంతో విపరీతమైన డిస్కషన్ జరిగింది. బలం లేకుండానే చంద్రబాబు ఏ ధైర్యంతో ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టారు? ఇప్పటికే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దానికి తోడు పక్క పార్టీల నుంచి వచ్చిన 5మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

అంటే 156 ఎమ్మెల్యేలతో ఎదురులేని, తిరుగులేని పార్టీగా అత్యంత బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కొని తమ అభ్యర్థిని చంద్రబాబు ఎలా గెలిపించుకుంటారు అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇక్కడే చంద్రబాబు వ్యూహం ఫలించింది అని చెప్పాలి. ఎంతో ధైర్యంతో చంద్రబాబు తమ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా రాజకీయ ఎత్తుగడల్లో చంద్రబాబు ఏ విధంగా సక్సెస్ అవుతారు అనేది మరోసారి ప్రూవ్ అయ్యింది. అనురాధను గెలిచిపించింది సొంత పార్టీ ఎమ్మెల్యేలా? వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలా? అనేది తెలియాల్సి ఉంది.