ఇళ్ల స్థలాల పేరిట దందా : 10tv స్టింగ్ ఆపరేషన్ ను అభినందించిన నారా లోకేష్

  • Published By: madhu ,Published On : June 4, 2020 / 03:55 AM IST
ఇళ్ల స్థలాల పేరిట దందా : 10tv స్టింగ్ ఆపరేషన్ ను అభినందించిన నారా లోకేష్

ఏపీలో ఇళ్ల స్థలాల పేరుతో జరుగుతున్న వైసీపీ నేతల డబుల్ దోపిడీని 10టీవీ స్టింగ్‌ ఆపరేషన్‌ కళ్లకు కట్టిందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌. పట్టాలిస్తామనే పేరుతో నేతలు పేదల రక్తం తాగుతున్నారని ఆరోపించారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అంటూ కొన్నిచోట్ల రూ. 7 లక్షలు కూడా విలువ చేయని భూమిని రూ. 45 లక్షలకు కొని భారీ అవినీతికి తెరలేపారని లోకేశ్‌ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల ప్రజాధనాన్ని కొట్టేసారని వరుస ట్వీట్లతో లోకేశ్‌  వైసీపీపై ధ్వజమెత్తారు. 

అక్కడితో వైసీపీ నేతల ధనదాహం తీరలేదని.. ఇప్పుడు పట్టా కావాలంటే క్యాష్ కొట్టాల్సిందే అంటూ లబ్ధిదారులను వేధిస్తున్నారని మండిపడ్డారాయన. మహిళలు పుస్తెలు అమ్మి అవినీతి దాహాన్ని తీర్చే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాకి 20 వేల రూపాయల నుంచి లక్షన్నర వసూలు చేస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థమవుతుందని లోకేశ్‌ ఆరోపించారు. ఈ రేంజ్‌లో జే-టాక్స్ వసూలు చేస్తుంటే రూపాయి ఖర్చు లేకుండా ఇళ్ల స్థలాల పంపిణీ అంటూ జగన్ లెక్చర్‌ ఇస్తున్నారని.. ఇళ్ల స్థలాల స్కామ్‌పై విచారణ జరిపితే మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటకు వస్తాయన్నారు నారా లోకేశ్‌..

ఇళ్ల పట్టాల వ్యవహారంలో అవకతవకలు, అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్‌ ముత్యాలరాజు ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక టోల్‌ ఫ్రీనెంబర్‌ ద్వారా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని… ఎవరైనా లబ్ధిదారుల్ని మోసం చేస్తే సహించేది లేదని కలెక్టర్‌ హెచ్చరించారు. డబ్బు ఇవ్వలేకపోతే లబ్ధిదారుల జాబితా నుంచి తప్పిస్తామంటూ కొందరు బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని… ఇలాంటి వ్యక్తుల్ని ఉపేక్షించేది లేదని చెప్పారు.

 

Read:  వెస్ట్ గోదావరిలో ఉచిత ఇళ్ల స్థలాల దందా..10tv స్టింగ్ ఆపరేషన్