TDP MLC Ashok Babu : బ్రేకింగ్ న్యూస్… టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టు

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. పదోన్నతి సమయంలో విద్యార్హతను తప్పుగా

TDP MLC Ashok Babu : బ్రేకింగ్ న్యూస్… టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టు

Ashok Babu

TDP MLC Ashok Babu Arrest : టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌ బాబును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2022, ఫిబ్రవరి 10వ తేదీ గురువారం అర్ధరాత్రి 12.15 గంటలకు అరెస్టు చేశారు. అశోక్‌ బాబు ఉద్యోగ సమయంలో విద్యార్హతను తప్పుగా చూపించారని పేర్కొంటూ సీఐడీ ఆయనను అరెస్ట్‌ చేసింది. పదోన్నతి విషయంలో విద్యార్హత తప్పుగా చూపించారని అశోక్‌బాబుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ అధికారులు నిన్న రాత్రి ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై టీడీపీ స్పందించింది.

Read More : మీ గూగుల్ అకౌంట్లో డేటాను ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి

రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అశోక్‌బాబును సీఐడీ అరెస్ట్‌ చేసిందని విమర్శించింది. గతంలో అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా పని చేసిన సమయంలో అశోక్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. తన సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదు చేశారు. డిగ్రీ బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే అభియోగాలున్నాయి.

Read More : Saudi Arabia : కరోనాతో విదేశాల్లో 4,355 మంది భారతీయులు మృతి.. సౌదీలోనే అత్యధికం..!

అంతేగాకుండా తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్‌ చేయడమే కాకుండా, ఎన్నికల అఫిడవిట్‌లో కూడా డిగ్రీ చదివినట్లు పేర్కొన్నారనే అభియోగాల కింద కేసులు బుక్‌ చేశారు. అశోక్ బాబుపై ఐపీసీ 477A, 465, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2021లో అశోక్‌బాబుపై లోకాయుక్తాలో కేసు నమోదు కాగా, ఆ కేసును సీఐడీకి అప్పగించాలని లోకాయుక్తా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అశోక్‌బాబుపై కేసు నమోదు చేసి.. రాత్రి అదుపులోకి తీసుకున్నారు.