MLC Bachula Arjunudu : టీడీపీలో విషాదం.. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. జనవరిలో ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన కొన్నివారాలుగా మృత్యువుతో పోరాడారు. ఆయనను బతికించేందుకు డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఫలించలేదు.

MLC Bachula Arjunudu : టీడీపీలో విషాదం.. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

MLC Bachula Arjunudu : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. జనవరిలో ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన కొన్నివారాలుగా మృత్యువుతో పోరాడారు. ఆయనను బతికించేందుకు డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఫలించలేదు.

బచ్చుల అర్జునుడు ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. జనవరి 28న ఆయన గుండెపోటుతో నిద్రలోనే కోమాలోకి వెళ్లారు. వెంటనే కు కుటుంబసభ్యులు ఆయనను విజయవాడ రమేశ్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు డాక్టర్లు స్టెంట్ అమర్చారు. అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నారు. ఆయనకు బ్రెయిన్ డెడ్ అయ్యింది. రక్తపోటు నియంత్రణలోకి రాకపోవడంతో ఆయన పరిస్థితి విషమించి మరణించారు. దాదాపు నెల రోజుల పాటు డాక్టర్లు శక్తి వంచన లేకుండా బతికించేందుకు కృషి చేశారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. గురువారం సాయంత్రం ఆయన మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

Also Read..Lakshmi Parvathy Comments Over Junior NTR : జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి..టీడీపీని స్వాధీనం చేసుకోవాలి : లక్ష్మీ పార్వతి

బచ్చుల అర్జునుడు స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం. ఆయన బందరు మున్సిపల్ చైర్మన్ గా ప్రస్థానం ఆరంభించారు. 2014లో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. టీడీపీ కేంద్ర కమిటీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

Also Read..Chandrababu Naidu : జగన్ ఓటమి ఖాయం, ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

బచ్చుల అర్జునుడు మృతితో టీడీపీలో విషాదం అలుముకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యంత విశ్వాసపాత్రుడిగా బచ్చుల అర్జునుడు మెలిగారు. గన్నవరం ఇంచార్జిగా ఆయనను పార్టీ పంపింది. అక్కడ కూడా ఆయన కష్టపడి పని చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బచ్చుల అర్జునుడు మృతికి చంద్రబాబు సహా నేతలు సంతాపం తెలిపారు.