దళిత మహిళ ఫిర్యాదు-టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్

దళిత మహిళ ఫిర్యాదు-టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్

tdp mlc btech ravi arrested in chennai : టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఆదివారం కడప జిల్లా పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. ఒక దళిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు కేసులో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 19న జరిగిన దళిత మహిళ హత్య కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పులివెందులలో ర్యాలీ నిర్వహించాయి.

కాగా… హత్య జరిగిన 48 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి ఆ కుటుంబానికిన్యాయం చేశారు. అయినా టీడీపీ శ్రేణులు దళితకుటుంబానికి న్యాయం చేయాలంటూ ర్యాలీ నిర్వహించారని, తమ కుటుంబపరువుకు భంగం కలిగిందని ఆరోపించారు.

ఈ మేరకు హత్యకు గురైన దళిత మహిళ తల్లి డిసెంబర్ 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కడపజిల్లా పోలీసులు బీటెక్ రవితో సహా 21 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అందులో భాగంగా ఆదివారం బీటెక్ రవిని చెన్నైలో అరెస్ట్ చేశారు.