TDP MP Kanakamedala: కేటీఆర్ పొరుగు రాష్ట్రం అంటే..అది మా రాష్ట్రమే అనుకుని వైసీపీ నేతలు స్పందించారు: టీడీపీ ఎంపీ

గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ వైసీపీ నేతలనుద్దేశించి ఎద్దేవా చేశారు

TDP MP Kanakamedala: కేటీఆర్ పొరుగు రాష్ట్రం అంటే..అది మా రాష్ట్రమే అనుకుని వైసీపీ నేతలు స్పందించారు: టీడీపీ ఎంపీ

Kanaka

TDP MP Kanakamedala: తెలంగాణ మంత్రి కేటీఆర్ పొరుగు రాష్ట్రం అంటే..అది మా రాష్ట్రమే అనుకుని అరడజను మంది ఏపీ మంత్రులు స్పందించారని.. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ వైసీపీ నేతలనుద్దేశించి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిణామాలు తెలుగు రాష్ట్రాల పరువు తీసే విధంగా ఉన్నాయని..వైసీపీ పాలన గురించి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారో పక్క రాష్ట్రాల గురించి వినాల్సి వస్తుందని రవీంద్ర కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితి గురించి ప్రశ్నలు లేవనెత్తితే ఎదుటి వారి నోరు మూయించే విధంగా అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఎంతో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రే సంస్కార హీనమైన భాష మాట్లాడుతున్నారని రవీంద్ర కుమార్ అన్నారు.

Also read:Nitin Gadkari : గడ్కరీ వ్యాఖ్యలపై కమలనాధులు గుస్సా

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ పేరు ప్రస్తావించకుండా, విద్యుత్, రోడ్లు, నీరు, అభివృద్ధి అనే అంశాలపై మాట్లాడారని..అయితే కేటీఆర్ పొరుగు రాష్ట్రం అంటే..అది మా రాష్ట్రమే అనుకుని అరడజను మంది ఏపీ మంత్రులు స్పందించారంటూ ఎంపీ కనకమేడల ఎద్దేవా చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఉలిక్కి పడ్డారని ఆయన అన్నారు. ఏపీ పరిస్థితులపై నేడు కేటీఆర్ మాట్లాడారు..కానీ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటినుంచో టీడీపీ మాట్లాడుతూనే ఉందని రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుకోవడానికి ఏపీ సీఎం జగన్ ఒప్పుకున్నారని గతంలో హరీష్ రావు మాట్లాడారని..తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 3 ఎకరాలు వస్తాయని కేసీఆర్ మాట్లాడారని.. ఈ పరిస్థితులు వాస్తవమా? కాదా? వైసీపీ ప్రభుత్వమే చెప్పాలని ఎంపీ రవీంద్ర కుమార్ ప్రశ్నించారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో రోడ్లు అద్వాన్నంగా ఉండగా..మరో రెండు నెలల్లో వర్షాకాలం వస్తే ఉన్న రోడ్లు కూడా నామరూపాలు లేకుండా పోతాయని రవీంద్ర కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read:Manickam Tagore On Rahul Tour : రాహుల్ రాకతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది-మాణిక్కం ఠాగూర్

గత వర్షాలకు కొట్టుకు పోయిన రోడ్లని ఇంతవరకు బాగు చేయలేదని..గత ఏడాది కాలం నుంచి రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు వేశారు.. ఎంత నిధులు కేటాయించారో సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఏపీలో ప్రకటిత, అప్రకటిత కోతలు ఉన్నాయా లేవా చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేదని, కానీ సీఎం జగన్ పీపీఏ అగ్రిమెంట్లు రద్దు చేసి విద్యుత్ సంక్షోభానికి కారకులు అయ్యారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ముడేళ్ళల్లో ఆరు సార్లు రేట్లు పెంచి రూ.15 వేల కోట్లు ప్రజలపై భారాలు మోపారని అన్నారు. సోలార్, విండ్ పవర్ సంస్థలపై దాడులు చేసి అగ్రిమెంట్లు రద్దు చేసి కోర్టుల్లో పోరాడుతున్నారని రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర పరిధిలో జాతీయ రహదారుల నిర్మణానికి, రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంలేదని పార్లమెంట్ లో కేంద్రం ప్రకటించిందని దీంతో అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందో సీఎం జగన్ చెప్పాలని రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు.

Also read:P Chidambaram: మోదీకే ఇది సాధ్యం: దేశంలో విద్యుత్ కొరతపై కాంగ్రెస్ నేత పీ.చిదంబరం వ్యంగ్యాస్త్రాలు

గతంలో రోడ్లు నిర్మించిన వారికి బిల్లులు ఇవ్వకుండా సొంత అవసరాలకు నిధులు వాడుకున్నారని రవీంద్ర కుమార్ ఆరోపించారు. ఏపీకి ఎంత ఆదాయం వస్తుంది..ఎంత సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారో స్పష్టంగా చెప్పాలని కూడ రవీంద్ర కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2019-20లో ఏపీకి రూ.1,55,076 కోట్లు, 2020-2021లో రూ.1,86,551 కోట్లు, 2021-22లో రూ.1,81,855 కోట్లు ఆదాయం వచ్చిందని రవీంద్ర కుమార్ చెప్పుకొచ్చారు. ఈలెక్కన టీడీపీ హయాంలో వచ్చిన ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వైసీపీ హయాంలో వచ్చిందని రవీంద్ర కుమార్ తెలిపారు. సంక్షేమ పధకాలకు గానూ 2019-20లో రూ.43574 కోట్లు, 2020-21లో రూ.47 వేల కోట్లు, 2021-22లో రూ.47,937 కోట్లు సంక్షేమ పధకాలకు ఖర్చు చేశారని రవీంద్ర కుమార్ వివరించారు. మొత్తం 38 శాతం నిధులు సంక్షేమానికి ఖర్చు చేస్తే మిగతా 62 శాతం ఏమైందని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అవినీతికి రాష్ట్ర నిధులను ఖర్చు చేస్తున్నారని రవీంద్ర కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం ఏపీకి రూ.7,96,000 కోట్లు అప్పులు ఉండగా, చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి ఇది రూ.లక్షా 71 వేల కోట్లుగా ఉండేదని అన్నారు. జగన్ పాలనలో రూ. 6 లక్షల 20 వేల కోట్లు అప్పులు చేశారని రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. ఏపీ తీసుకున్న అప్పులు రాజ్యాంగ విరుద్ధం అని కేంద్రం ఆర్ధిక శాఖకు నోటీసులు ఇచ్చిందని కూడా రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.

Also read:Minister talasani: కరెంట్ లేకుంటే ఇక్కడెందుకు శుభకార్యాలు చేస్తున్నారు?

అవసరానికి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చి మరీ సీఎం జగన్ అప్పుల కోసం ఆర్ధిక శాఖను అభ్యర్ధిస్తున్నారని రవీంద్ర కుమార్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన కోవిడ్ పరిహారం నిధులు దారి మళ్లించిందని, నిబంధనలకు విరుద్ధంగా రూ.17 వేల కోట్లు అదనంగా కేంద్రం వద్ద అప్పులు చేసి రాష్ట్ర పరువు తీశారని ఎంపీ రవీంద్ర కుమార్ విమర్శించారు. ఏపీలో వేల లక్షల కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయని ఆయన ప్రశ్నించారు. జగన్ పై ఉన్న ఆర్ధిక నేరాల కేసులు 2012 నుంచి విచారణకు రాకుండా చేస్తున్నారని, రాష్ట్రంలో పోలీస్ యంత్రగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రవీంద్రకుమార్ మండిపడ్డారు. పాలనా దోపిడిలో భాగంగానే ఏపీలో సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని..ఉన్న రెండేళ్లలో అయినా వైసిపి తన పాలన చక్కదిద్దు కోవాలి..లేదంటే ప్రజలే వైసిపిని గద్దె దించుతారని రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు.

Also read:PM Modi : కోర్టుల్లో స్థానిక భాషల ఉపయోగంపై మోదీ కీలక వ్యాఖ్యలు