Kesineni Nani : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. టీడీపీ ఎంపీ సంచలన ప్రకటన

అసలే కష్టాల్లో ఉన్న టీడీపీకి ఆ పార్టీ నేతలు ఊహించని షాక్ లు ఇస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో (2024) నేను, నా కూతురు

Kesineni Nani : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. టీడీపీ ఎంపీ సంచలన ప్రకటన

Kesineni Nani

Kesineni Nani : అసలే కష్టాల్లో ఉన్న టీడీపీకి ఆ పార్టీ నేతలు ఊహించని షాక్ లు ఇస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో (2024) నేను, నా కూతురు(శ్వేత) పోటీ చేయము అని కేశినేని నాని చంద్రబాబుకి చెప్పారట. నాని ప్రకటన తెలుగుదేశం వర్గాల్లో సెగ పుట్టించింది. కేశినేని నాని ఇలా చెప్పడానికి కారణం లేకపోలేదు. బెజవాడ నేతల మధ్య వర్గపోరు ఉంది. నాటి గొడవలతో కేశినేని నాని తీవ్ర మనస్తాపం చెందారు.

Andhra Pradesh : వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

టీడీపీ అధిష్టానం తీరుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని అసంతృప్తిగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం విజయవాడలో జరిగిన టీడీపీ చీఫ్ చంద్రబాబు పర్యటనకు కూడా కేశినేని దూరంగా వున్నారు.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నగర పార్టీ నేతల మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బొండా ఉమా.. కేశినేని నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి నాని కూడా కౌంటరిచ్చారు. ప్రధానంగా నాని కుమార్తెకు మేయర్ సీటు విషయంలోనే ఈ వివాదం రేగింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు .. నేతలంతా సర్దుకుపోవాలని సూచించారు. అయితే తనపై నగర పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నాని మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది.

AP Secretariat : సచివాలయం ఉద్యోగులకు ఉచిత వసతి నిలిపివేత

ఎంపీ కాళ్లు విరగ్గొడతాను అంటూ సొంత పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని నాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు నాని దూరంగా ఉంటున్నారు. ఎంపీగా మాత్రం అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను, తన కుమార్తె పోటీ చేయకూడదని కేశినేని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరి నాని నిర్ణయంపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

కేశినేని నాని.. విజయవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన లీడర్‌. ట్రావెల్‌ బిజినెస్‌ నుంచి అంచెలంచెలుగా నాయకుడిగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన కేశినేని నాని.. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ విజయవాడ ఎంపీగా రెండోసారి విజయం సాధించారు. అయితే రెండోసారి ఎంపీగా గెలిచినప్పటి నుంచే ఆయన టీడీపీ అధినాయకత్వంతో విభేదిస్తున్నట్టు కనిపించారు. కృష్ణా జిల్లా టీడీపీ ముఖ్యనేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్నలతో కేశినేని నానికి మొదటి నుంచి పొసగడం లేదు. వీరిపై ఆయన బాహాటంగానే విమర్శలు చేస్తూ వచ్చారు. మధ్యలో టీడీపీ అధినాయకత్వం కల్పించుకుని రెండు వర్గాల మధ్య సయోధ్య కుదుర్చినట్టు కనిపించింది. అయినప్పటికి నాని మాత్రం అసంతృప్తితోనే ఉన్నారు.