కారణం ఇదేనా?: టీడీపీ వెబ్ సైట్ కు ఏమైంది?

తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ సడన్ గా నిలిచిపోయింది. టీడీపీ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే.. Error 1016 అనే ఎర్రర్ వస్తుంది. టీడీపీ యాప్ రూపొందించిన ఐటీ గ్రిడ్ సంస్థపై డేటా చోరీ ఆరోపణలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదమైంది.

  • Published By: sreehari ,Published On : March 7, 2019 / 11:33 AM IST
కారణం ఇదేనా?: టీడీపీ వెబ్ సైట్ కు ఏమైంది?

తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ సడన్ గా నిలిచిపోయింది. టీడీపీ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే.. Error 1016 అనే ఎర్రర్ వస్తుంది. టీడీపీ యాప్ రూపొందించిన ఐటీ గ్రిడ్ సంస్థపై డేటా చోరీ ఆరోపణలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదమైంది.

తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ సడన్ గా నిలిచిపోయింది. టీడీపీ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే.. Error 1016 అనే ఎర్రర్ వస్తుంది. టీడీపీ యాప్ రూపొందించిన ఐటీ గ్రిడ్ సంస్థపై డేటా చోరీ ఆరోపణలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదమైంది. ఈ తరుణంలో ఏపీ ప్రజల పర్సనల్ డేటా స్కాంలో అధికార పార్టీపై ఆరోపణలు వెల్లువెత్తడంతో టీడీపీ వెబ్ సైట్ కు సంబంధించిన కార్యకలాపాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి.
Also Read : సిట్ షాకింగ్ న్యూస్ : సేవామిత్ర యాప్‌లో తెలంగాణ డేటా

టీడీపీ అధికారిక వెబ్ సైట్ www.telugudesam.org లింక్ ఓపెన్ చేస్తే ఎర్రర్ మెసేజ్ వస్తోంది. టీడీపీ సేవా మిత్ర యాప్ డేటా బయటకు పొక్కకుండా ఉండేందుకే టీడీపీ వెబ్ సైట్ ను నిలిపివేశారనే అనుమానాలను రేకిత్తిస్తోంది. టీడీపీ ఆన్ లైన్ సభ్యుత్వ నమోదు ప్రక్రియను కూడా నిలిపివేసినట్టు సమాచారం. వెబ్ సైట్ నిలిచిపోవడానికి ఏదైనా టెక్నికల్ ఇష్యూ కారణామా లేదా మరేదైనా కారణామా? అసలు కారణం తెలియాల్సి ఉంది.

హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ కోసం ఐటీ గ్రిడ్స్ సంస్ధ పని చేస్తోంది. ఏపీలో ఓటర్ల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేశారంటూ ఐటీ గ్రిడ్ సంస్థపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. మరోవైపు ఐటీ గ్రిడ్స్ కేసులో సిట్ దర్యాప్తు ఊపందుకొంది.
Also Read : వైసీపీలో జయసుధ : జగన్ సీఎం కావడం ఖాయం

ఈ కేసులో నియమితమైన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు మార్చి 07వ తేదీ గురువారం భేటీ అయ్యింది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం వహిస్తున్న ఈ బృందంలో మొత్తం 9 మంది వరకు ఉన్నారు. డేటాను విశ్లేషించడం, డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు టీం పని చేయనుంది. కీలక రోల్‌గా ఉన్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్‌ను పట్టుకోవడానికి సిట్ బృందం గాలిస్తోంది.  
Also Read : డేటా యుద్ధం : మూడు బృందాలతో విచారణ