Ashok Gajapathiraju : జగన్ నిర్ణయాలతో జనానికి తీవ్ర నష్టం : అశోక్ గజపతిరాజు

రాష్ట్రంలో అస్థిరత పెద్ద స్ధాయిలో నెలకొందని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. జగన్ నిర్ణయాలతో జనానికి తీవ్ర నష్టం అన్నారు. వికేంద్రీకరణ పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు.

Ashok Gajapathiraju : జగన్ నిర్ణయాలతో జనానికి తీవ్ర నష్టం : అశోక్ గజపతిరాజు

Ashok

Ashok Gajapathiraju criticized Jagan : రాష్ట్రంలో అస్థిరత పెద్ద స్ధాయిలో నెలకొందని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. జగన్ నిర్ణయాలతో జనానికి తీవ్ర నష్టం అన్నారు. వికేంద్రీకరణ పేరుతో మోసం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా అమరావతిని స్వాగతించి, అధికారం రాగానే మూడు రాజధానుల మంత్రం జపిస్తున్నారని విమర్శించారు. వికేంద్రీకరణ అంటే నవ్వులాటగా ఉందా అన్నారు.

వెనుకబడిన జిల్లాల అభివృద్ధని పదే పదే జపించే జగన్.. చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో భవనాలకు రంగులేస్తే రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు. అస్ధిరత పెరగటం వలన అన్ని అవకాశాలు పోయానని తెలిపారు. పొరుగు రాష్ట్రాల కంటే వెనుకబడతామని చెప్పారు.

High Court : మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టులో విచారణ..సీబీఐకి అప్పగించే అంశంపై తీర్పు రిజర్వ్

పాత చట్టం తీసేసి కొత్త చట్టంతో వస్తామన్నదానికి అర్థం పర్ధం లేదన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ గాడిలో పడనివ్వదని విమర్శించారు. కొన్ని విషయాలు చూస్తే భయంగా వుందన్నారు.