Kinjarapu Atchannaidu : దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడు, సీఎం జగన్ మాకే ఓటేశారేమో?- అచ్చెన్నాయుడు

అనవసరంగా పోటీ పెట్టారంటూ కుక్కలన్నీ మొరిగాయి. మా ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టారు. మా వ్యాపారాలు దెబ్బతీసే ప్రయత్నం చేశారు.(Kinjarapu Atchannaidu)

Kinjarapu Atchannaidu : ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన ఫలితం వచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ అనూహ్య విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలుపొందారు. వైసీపీ కచ్చితంగా 7కు 7 ఎమ్మెల్సీ సీట్లు నెగ్గాల్సిన చోట టీడీపీ ఒక సీటు గెలిచింది. టీడీపీకి 19మంది ఎమ్మెల్యేల మద్దుతు మాత్రమే ఉంటే.. 23 ఓట్లు రావడం విశేషం.

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు టీడీపీకి పడినా.. తమదే విజయం అని వైసీపీ ధీమా వ్యక్తం చేసింది. అయితే, అనూహ్యంగా మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేశారు. వాళ్లిద్దరు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని వైసీపీ నాయకులు అనుమానిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. దేవుడు స్క్రిప్ట్ తిరగ రాశాడు అని ఆయన కామెంట్ చేశారు.(Kinjarapu Atchannaidu)

Also Read..TDP 23 Number : డేట్ 23, ఎమ్మెల్యేలు 23, ఓట్లు 23.. నెగిటివ్ నెంబర్‌ను లక్కీ నెంబర్‌గా మార్చుకున్న టీడీపీ

”23 ఓట్లతో గెలిచాం.. ఇవాళ తేదీ 23, ఏడాది 2023. అన్నింటికంటే ఎక్కువ ఓట్లు మా అభ్యర్థికి వచ్చినా ప్రకటనలో మళ్లీ జాప్యం చేస్తున్నారు. అనవసరంగా పోటీ పెట్టారంటూ కుక్కలన్నీ మొరిగాయి. మా ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టారు. మా వ్యాపారాలు దెబ్బతీసే ప్రయత్నం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా విందు రాజకీయాలు చేశారు.

మేం పోటీ పెట్టడం వల్లే ఎమ్మెల్యేలపై జగన్ కు అమిత గౌరవం పెరిగింది. మేం పోటీ పెట్టడం వల్లే వైసీపీ ఎమ్మెల్యేలకు గౌరవం పెరిగింది. మళ్లీ రీ-కౌంటింగ్ చేయడమేంటీ..? సిగ్గు ఉండాలి కదా..? ఎన్నికల సంఘంతో చంద్రబాబు మాట్లాడారు. గెలిచినా డిక్లేర్ చేయకపోవడడం ఏంటీ..? వైనాట్ 175 అన్నారు.

Also Read..Chandrababu : వచ్చే ఎలక్షన్స్ జగన్ పర్సెస్ పబ్లిక్.. ఇక ఏ ఎన్నికల్లోనూ గెలవడు : చంద్రబాబు

మా అభ్యర్థికి ఎవరు ఓటేశారో మాకు అనవసరం. మాకు ఎవరు ఓటేశారో కూడా తెలీదు. సీఎం జగనే స్వయంగా మాకే ఓటేశారేమో..? ఓటింగ్ లో పాల్గొనకుండా భవానీ కుటుంబాన్ని వేధిస్తారా..? కింజరాపు వాళ్లు అంటే ఏమనుకున్నారు? పీక తెగ్గొసుకుంటాం కానీ భయపడం. వార్ వన్ సైడే” అని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. వైసీపీ ఎమ్మెల్యేలు సక్రమంగా ఓటు వేయడంలో సక్సెస్ అయిన అధిష్టానం టీడీపీ అభ్యర్థికి ఓట్లు పడకుండా అడ్డుకోవడంలో విఫలమైంది. దీంతో పంచుమర్తి అనురాధ గెలుపు లాంఛనమైంది. పంచుమర్తి అనురాధ గెలుపునకు 22 ఓట్లు అవసరం కాగా 23 ఓట్లు వచ్చాయి.(Kinjarapu Atchannaidu)

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఏడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 8 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఏడు స్థానాలను కైవసం చేసుకోవాలని వైసీపీ ప్రయత్నించినప్పటికీ అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పంచుమర్తి అనురాధతో నామినేషన్ వేయించారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది.

Also Read..MLC Election Results 2023 : పవన్ కళ్యాణ్ మాట నిజమైంది.. ఈ ఎన్నికలు శుభపరిణామం.. గంటా శ్రీనివాసరావు

ఇది క‌దా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్- లోకేశ్ సెటైర్లు
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. సీఎం జగన్ టార్గెట్ గా సెటైర్లు పేల్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన పంచుమర్తి అనురాధను అభినందిస్తూ, సీఎం జగన్ ను విమర్శిస్తూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్, చేనేత ఆడ‌ప‌డుచు, తెలుగుదేశం కుటుంబ‌ స‌భ్యురాలు పంచుమ‌ర్తి అనూరాధకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటన విడుదల చేశారాయన. ఈ సందర్భంగా వైసీపీపై సెటైర్లు వేశారు. ”టీడీపీ 23 సీట్లే గెలిచిందని ఎద్దేవా చేశారు. అందులో ‘న‌లుగురిని సంత‌లో ప‌శువుల్లా కొన్నావు. చివ‌రికి అదే 23న‌, అదే 23 ఓట్లతో నీ ఓట‌మి-మా గెలుపు. ఇది క‌దా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్’ అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు.

ట్రెండింగ్ వార్తలు