తాడిపత్రి టీడీపీదే.. చైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి టీడీపీదే.. చైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి

Jc

తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా పీ సరస్వతి ఎంపికయ్యారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతుతో ప్రభాకర్‌రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

మూడు రోజుల కిందట ఎమ్మెల్సీల ఎక్స్‌అఫీషియో ఓట్లను మున్సిపల్‌ కమిషనర్‌ తిరస్కరించిన తర్వాత నుంచి ఈ ఛైర్మన్‌ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు శిబిరాలు సైతం ఏర్పాటు చేయగా.. చివరకు టీడీపకే పీఠం దక్కింది. తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డుల్లో రెండు ఏకగ్రీవం అవ్వగా.. 34 వార్డులకు ఎన్నికలు జరిగాయి.. టీడీపీ 18, వైకాపా 14, సీపీఐ, స్వతంత్రులు తలొకటి గెలుచుకున్నారు.

ముందు నుంచే సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు టీడీపీకి అనుకూలంగా ఉండగా.. వైసీపీకి ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్య నమోదు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీబలం 18కి చేరింది. ఉద్రిక్తలు తలెత్తకుండా.. పోలీసులు మోహరించగా.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి చేరకుని ఓటింగ్‌లో పాల్గొన్నారు.

భారీ కాన్వాయ్‌తో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్దకు రాగా.. టీడీపీ, ఇండిపెండెంట్, సీపీఐ కౌన్సిలర్‌లతో కలిసి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యాలయానికి చేరుకున్నారు.

Jc1

Jc1