Paritala Sreeram: పరిటాల శ్రీరామ్‌కి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు.

10TV Telugu News

Paritala Sreeram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. వైసీపీకి సంబంధించిన పలువురు నేతలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే కరోనా బారిన పడగా.. లేటెస్ట్‌గా ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా సోకినట్లుగా శ్రీరామ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.


‘కరోనా పరీక్షలు చేయించుకోగా.. స్వల్ప లక్షణాలతో పాజిటివ్‌ వచ్చింది. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన మా శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉండి, ఏవైనా లక్షణాలు ఉంటే మాత్రం టెస్ట్ చేయించుకోవాలి.’ అని పరిటాల శ్రీరామ్ తెలిపారు.

ఏపీలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఈ నెల ఆరంభంలో కంట్రోల్‌లో ఉన్న కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. జనవరి 7వ తేదీన ఏపీలో వచ్చిన కేసులు 840. లేటెస్ట్ లెక్కల ప్రకారం 24గంటల్లో 4వేల 348మంది కరోనా బారినపడ్డారు.

×