దారి తప్పిన గురువు : క్లాస్ రూమ్ లో లైంగిక వేధింపులు

వారంతా ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు. వారి పని ఆ విద్యను విద్యార్థులకు పంచడం. ఆ విద్యార్థులను ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లడం. అలాంటి వ్యక్తులు కొందరు కీచకుల్లాగా

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 03:20 PM IST
దారి తప్పిన గురువు : క్లాస్ రూమ్ లో లైంగిక వేధింపులు

వారంతా ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు. వారి పని ఆ విద్యను విద్యార్థులకు పంచడం. ఆ విద్యార్థులను ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లడం. అలాంటి వ్యక్తులు కొందరు కీచకుల్లాగా

వారంతా ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు. వారి పని ఆ విద్యను విద్యార్థులకు పంచడం. ఆ విద్యార్థులను ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లడం. అలాంటి వ్యక్తులు కొందరు కీచకుల్లాగా మారుతున్నారు. విద్యాబుద్దులు నేర్పించాల్సింది పోయి..దారి తప్పుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి కీచకుల్లాగా మారుతున్నారు. తరగతి గదుల్లో పుస్తకాల్లోని పాఠాలకు బదులు ప్రేమ పాఠాలు బోధిస్తున్నారు. 

ఆరు బయటే అనుకుంటే..చివరకు గుడి లాంటి బడిలో కూడా బాలికలకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. దేవుడిలా భావించే కొందరు గురువులు మృగాళ్లుగా మారుతున్నారు. అభం శుభం తెలియని బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. పిచ్చి చేష్టలతో భయాందోళనకు గురిచేస్తున్నారు. తరగతి గదుల్లో చదువు చెప్పాల్సింది పోయి..ప్రేమ పాఠాలు బోధిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి ఓ కీచక టీచర్‌ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఏకంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడే విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.

రాజోలు మండలం బి.సావరంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం తీరు వివాదానికి దారితీసింది. విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సిన టీచర్ కామాంధుడిగా మారాడు. విద్యార్థులు చెడు మార్గాలు పట్టకుండా చూడాల్సిన వాడే చెడు మార్గం ఎంచుకున్నాడు. బాలికలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కాటేయబోయాడు. ప్రేమ పాఠాలు భోదిస్తూ…విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. 

ఇతడి కీచక పర్వం కొన్నాళ్లుగా సాగుతున్నా…బాధిత బాలికలెవ్వరూ భయంతో బయటపెట్టలేకపోయారు. కొందరు బాలికలు ధైర్యంతో ముందుకురావడంతో కీచకుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకున్నారు. ఆ కీచక ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధిత బాలికల తల్లిదండ్రులతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.