క్రికెట్ ఆడుతుండగా గొడవ…యువకుడు కత్తితో దాడి

  • Edited By: bheemraj , June 4, 2020 / 09:46 PM IST
క్రికెట్ ఆడుతుండగా గొడవ…యువకుడు కత్తితో దాడి

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన గొడవ కత్తితో దాడి చేసుకునే వరకు వెళ్లింది. కొత్తూరు కాలేజీ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుండగా ఇద్దరు యువకుల మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో సాయి అనే యువకుడిపై సూర్య అనే యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ ఘటనలో సాయికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం అతన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Read: కొంపముంచిన కరోనా, హైదరాబాద్‌లో కొవిడ్ బాధితుడి ఇంట్లో చోరీ