Krishna Water : కృష్ణా జలాల వివాదం.. కేఆర్ఎంబీకి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం

కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డుకు లేఖరాసింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించాలంటే త్రిసభ్యకమిటీ ఆమోదం ఉండాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. త్రిసభ్యకమిటీ ఆమోదించకుండా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించేందుకు అనుమతి ఇవ్వకూడదని కృష్ణా బోర్డును కోరింది.

Krishna Water : కృష్ణా జలాల వివాదం.. కేఆర్ఎంబీకి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం

Krishna Water

Krishna Water : కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డుకు లేఖరాసింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించాలంటే త్రిసభ్యకమిటీ ఆమోదం ఉండాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. త్రిసభ్యకమిటీ ఆమోదించకుండా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించేందుకు అనుమతి ఇవ్వకూడదని కృష్ణా బోర్డును కోరింది.

రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్నందున 2021-22 వాటర్ ఇయర్ నుంచి రెండు రాష్ట్రాలకు సమానంగా నీటిని పంచాలని కోరింది. కృష్ణా నదికి వరద పోటెత్తిన నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని, ఏపీ జల విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని లేఖలో పేర్కొంది.

ఇక ఇదిలా ఉంటే కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. నదిపై ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలా దర్శనం ఇస్తున్నాయి. వరద అధికంగా ఉండటంతో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. కాగా గతంలో ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు కృష్ణా నదిపై ఉన్న తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం నీరు పుష్కలంగా ఉండటంతో విద్యుత్ ఉత్పత్తికి అనుమతివ్వాలని తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ ను కోరింది.