IAS Srilakshmi: ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఊరట.. క్లీన్ చిట్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

ఓఎంసీ కేసులో కొంతకాలంగా అనేక అభియోగాలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది.

IAS Srilakshmi: ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఊరట.. క్లీన్ చిట్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

IAS Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. ఈ కేసులో విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఆమెను నిర్దోషిగా పరిగణించిన కోర్టు, కేసు నుంచి శ్రీలక్ష్మిని తప్పిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలన్ మస్క్ వారానికి ఎన్ని గంటలు పని చేస్తున్నాడో తెలుసా?
ప్రస్తుతం శ్రీలక్ష్మి ఏపీ కేడర్‌లో పని చేస్తున్నారు. గతంలో ఈ కేసులో ఆమె ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించారు. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004-2009 మధ్య మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. ఈ సమయంలో ఓఎంసీకి గనుల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడ్డట్లు ఆమెపై అనేక అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై సుదీర్ఘకాలం విచారణ జరిపిన కోర్టు ఆమెపై నమోదైన అభియోగాల్ని కొట్టివేసింది. తనపై నమోదైన కేసుల నుంచి శ్రీలక్ష్మి బయటపడటంతో ఆమె కెరీర్‌కు హెల్ప్ కానుంది. ఆమె ఏపీ చీఫ్ సెక్రటరీ అయ్యేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.