Inter Students : తెలంగాణ విద్యార్థులు ఏపీలో మళ్లీ ఫస్టియర్ చేరాల్సిందే

ఏపీలో ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్‌ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ప్రకటించారు. ఈ మేరకు అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రవేశాల సమయంలో విద్యార్థులు టీసీ, టెన్త్‌ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే, తెలంగాణలో ఫస్టియర్‌ ఇంటర్ చదివిన విద్యార్థులు ఏపీలో చదవాలనుకుంటే మళ్లీ ఫస్టియర్‌లో చేరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

Inter Students : తెలంగాణ విద్యార్థులు ఏపీలో మళ్లీ ఫస్టియర్ చేరాల్సిందే

Inter Students

Inter Students : ఏపీలో ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్‌ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ప్రకటించారు. ఈ మేరకు అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రవేశాల సమయంలో విద్యార్థులు టీసీ, టెన్త్‌ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే, తెలంగాణలో ఫస్టియర్‌ ఇంటర్ చదివిన విద్యార్థులు ఏపీలో చదవాలనుకుంటే మళ్లీ ఫస్టియర్‌లో చేరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటివరకు ఇంటర్ కోర్సులో ప్రవేశానికి విద్యార్థులు పడుతున్న ఇక్కట్లకు చెక్‌ పెడుతూ ఏపీ ఇంటర్‌ బోర్డు ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విధానానికి శ్రీకారం చుట్టింది. స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ ఉంటే ఇంట్లో నుంచే ఇంటర్మీడియెట్‌ కోర్సులో చేరవచ్చు. ఏపీలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్, ఇన్సెంటివ్‌ జూనియర్‌ కాలేజీలు, కాంపోజిట్‌ జూనియర్‌ కాలేజీల్లోని జనరల్, ఒకేషనల్‌ ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలన్నీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ విధానంలోనే కొనసాగనున్నాయి.

టెన్త్‌ పాసైన విద్యార్థులు ఇంటర్ లో చేరటం ఇప్పటివరకు పెద్ద ప్రహసనంలా ఉండేది. ప్రభుత్వ యాజమాన్య కాలేజీల్లో ప్రవేశాలు నిబంధనల ప్రకారం జరుగుతున్నా ప్రైవేట్, కార్పొరేట్‌ కాలేజీలు మాత్రం అడిగిన మేర రూ.లక్షల్లో ఫీజు చెల్లించిన వారికే సీట్లు కేటాయిస్తున్నాయి. మెరిట్‌ విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విధానం ప్రారంభమవడంతో ఈ సమస్యలు తీరడమేగాక విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థి మెరిట్‌ను బట్టి తనకు నచ్చిన కాలేజీలో సీటు లభిస్తుంది. ‘డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌లో కొంత ప్రాథమిక సమాచారం ఇవ్వడం ద్వారా ఎటువంటి సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేకుండానే కాలేజీలో ప్రవేశం పొందొచ్చు.