Vivek Girreddy : కోటిన్నర జీతం.. అమెజాన్‌లో మెరిసిన తెలుగు తేజం

అసలే ప్రపంచ ప్రసిద్ధ సంస్థ. అందులో ఉద్యోగం. పైగా కోట్లలో జీతం. ఇంకేముంది లైఫ్ సెటిల్ అయినట్టే. ఇలాంటి జాబ్ కావాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ, ఆ జాబ్ కొట్టే టాలెంట్ కొందరికే ఉంటుంది. తెలుగు యువకుడు వివేక్‌ గిర్రెడ్డి(28) ఆ కోవకే చెందుతారు. తన టాలెంట్ తో ఆయన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌ లో జాబ్ సాధించారు. జీతం ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఏడాదికి అక్షరాల కోటిన్నర వేతనం.

Vivek Girreddy : కోటిన్నర జీతం.. అమెజాన్‌లో మెరిసిన తెలుగు తేజం

Vivek Girreddy

Vivek Girreddy : అసలే ప్రపంచ ప్రసిద్ధ సంస్థ. అందులో ఉద్యోగం. పైగా కోట్లలో జీతం. ఇంకేముంది లైఫ్ సెటిల్ అయినట్టే. ఇలాంటి జాబ్ కావాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ, ఆ జాబ్ కొట్టే టాలెంట్ కొందరికే ఉంటుంది. తెలుగు యువకుడు వివేక్‌ గిర్రెడ్డి(28) ఆ కోవకే చెందుతారు. తన టాలెంట్ తో ఆయన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌ లో జాబ్ సాధించారు. జీతం ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఏడాదికి అక్షరాల కోటిన్నర వేతనం.

ప్రస్తుతం అమెరికాలోని జార్జిటెక్‌ యూనివర్శిటీలో ఎంబీఏ చేస్తున్న వివేక్.. అమెజాన్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో రూ.1.50కోట్ల వార్షిక వేతనంతో సీనియర్ ఫైనాన్షియల్ ఎనలిస్టుగా ఎంపికయ్యారు. జూన్‌ 21న సియాటెల్‌లోని అమెజాన్ కేంద్ర కార్యాలయంలో విధుల్లో చేరనున్నారు.

వివేక్ తల్లిదండ్రులు భానురెడ్డి, జీఎస్‌ రెడ్డి హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో ఉంటున్నారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. జీఎస్‌ రెడ్డి సెబీలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వివేక్‌ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, మెక్‌గిల్‌ యూనివర్సిటీలో బీఏ ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ చదివి బెంగళూరులో మూడేళ్లు ఉద్యోగం చేశారు.

ఎంబీఏ చేయాలన్న ఉద్దేశంతో జీమాట్‌ రాసి 94 పర్సంటైల్‌ సాధించారు. అంతకుముందు శాట్‌లో గణితం విభాగంలో 800కు 800 సాధించారు. స్కాలర్‌షిప్ ద్వారా అట్లాంటాలోని జార్జిటెక్‌ యూనివర్శిటీలో రెండేళ్ల ఎంబీఏ(ఫైనాన్స్‌) కోర్సులో చేరారు. తొలి ఏడాది పూర్తయ్యాక అమెజాన్‌ కంపెనీలో 12 వారాల ఇంటర్న్‌షిప్‌ చేశారు. ఎంబీఏ చదివే ప్రతిభావంతులైన విద్యార్థుల వివరాలు ప్రచురించే ‘పొయట్స్‌ అండ్‌ క్వాంట్స్‌’ మేగజైన్‌లో గతేడాది(2020) వివేక్‌ గురించి కథనం ప్రచురితమైంది.