Telugu States : జెండాలు ఎగురేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు జరిగాయి.

Telugu States : జెండాలు ఎగురేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Kcr And Jagan

Telugu States Chief Ministers : తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ గోల్కొండ కోట ఇందుకు వేదిక అయ్యింది. ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్‌.. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గోల్కొండ కోటలో ఈ వేడుకలకు సంబంధించిన పోలీసుల రిహార్సల్స్ కూడా పూర్తయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. అసెంబ్లీ, బీఆర్‌కే భవన్‌తో పాటు నగరంలోని ప్రముఖ భవనాలన్నీ రంగు రంగుల వెలుగులతో మిరుమిట్లు గొలిపాయి.

Read More : Big Boss 5: ఈసీజన్ టైటిల్ విన్నర్‌గా లేడీ కంటెస్టెంట్‌కు అవకాశం?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా సైనిక విన్యాసాలు, తెలంగాణ రాష్ట్ర ఉనికిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read More : Covid-19 : దేశంలో పెరిగిన రికవరీ రేటు.. 36 వేల కేసులు.. 38 వేల రికవరీలు

2018లో ఇచ్చిన హామీలు, చేసిన పనులను రాష్ట్ర ప్రజలకు వివరించారు సీఎం కేసీఆర్. తెలంగాణ దళిత బంధు, రైతు రుణమాఫీ, నూతన సచివాలయం, డబుల్ బెడు రూం ఇల్లు, పీఆర్సీపై ఈ సందర్భంగా ప్రభుత్వ నిబద్ధతను ప్రస్తావించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లల్లో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం వివరణ ఇచ్చారు.

Read More : Mouni Roy: బికినీలో మౌనీ రాయ్ ఫోజులు.. కిల్లర్ లుక్.. అందమైన ఫోటోలు

మరోవైపు…ఏపీలోని విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాల నుంచి సీఎం జగన్‌ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీఎం జగన్‌ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వనించారు. పాస్‌లు ఉన్నవారికే వేడుకలకు అనుమతించారు.