GST Income : పెరిగిన తెలుగు రాష్ట్రాల జీఎస్‌టీ ఆదాయం

2021 జులైలో తెలుగు రాష్ట్రాల జీఎస్‌టీ ఆదాయం 25 శాతానికి పైగా పెరిగింది. జులైలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,730 కోట్లు, తెలంగాణకు రూ.3,610 కోట్ల ఆదాయం వచ్చింది. ఏపీకి గతేడాది జులైలో రూ.2,130 కోట్లు రాగా ఈసారి అది 28% వృద్ధి చెందింది.

10TV Telugu News

GST Income :  కేంద్ర ఆర్థికశాఖ ఆదివారం జులై నెల జీఎస్టీ ఆదాయం వివరాలు విడుదల చేసింది. గతేడాది జులైతో పోలిస్తే ఈ ఏడాది జులైలో ఆదాయం భారీగా పెరిగింది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 2020 జులైతో పోలిస్తే 2021 జులైలో తెలుగు రాష్ట్రాల జీఎస్‌టీ ఆదాయం 25 శాతానికి పైగా పెరిగింది. జులైలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,730 కోట్లు, తెలంగాణకు రూ.3,610 కోట్ల ఆదాయం వచ్చింది. ఏపీకి గతేడాది జులైలో రూ.2,130 కోట్లు రాగా ఈసారి అది 28% వృద్ధి చెందింది.

తెలంగాణకు క్రితం సారి రూ.2,876 కోట్లు రాగా ఈసారి అది 26% పెరిగింది. గతేడాది జులైలో రాష్ట్రాలకు రూ.66,291 కోట్ల జీఎస్‌టీ ఆదాయం రాగా ఈసారి 32% పెరిగి రూ.87,678 కోట్లకు చేరింది.

ఇక కేంద్ర ప్రభుత్వానికి కూడా గతేడాదితో పోల్చితే 33% ఆదాయం పెరిగింది. కేంద్రానికి ఈ ఏడాది జులైలో రూ.1,16,393 కోట్ల ఆదాయం వచ్చింది. 2021 జులైకి ల‌క్షా 16 వేల కోట్ల రూపాయ‌ల మేర జీఎస్టీ వ‌సూలైన‌ట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ప్ర‌క‌టించింది. 2020 జులైతో పోల్చితే 33 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు తెలిపింది. ఆర్థిక వ్య‌వ‌స్థ వేగంగా కోలుకుంటోంద‌నేందుకు ఇదే సంకేత‌మ‌ని ఆర్థిక శాఖ అభిప్రాయ‌పడింది. 2020 సంవత్సరం జూలైలో జీఎస్టీ ద్వారా రూ. 87,422 కోట్లు కాగా.. 2021 జూన్‌లో రూ.92,849 కోట్లు వచ్చింది.

జూలైలో ఆదాయం రూ.1,16,393కోట్లకు పెరిగింది. ఈ మొత్తంలో కేంద్ర జీఎస్టీ రూ. 22 వేల 197 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ రూ.28 వేల 541 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.57 వేల 864 కోట్లు ఉన్న‌ట్టు వెల్ల‌డించింది. దిగుమ‌తి చేసుకున్న వ‌స్తువుల‌తో క‌లిపి 7 వేల 790 కోట్ల సెజ్ వ‌సూలైన‌ట్టు తెలిపింది.

10TV Telugu News