November Bank Holidays : వచ్చే నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవు.. ఇందులో నిజమెంత?

కొత్త నెల ప్రారంభం ముందు చాలామంది బ్యాంకు సెలవుల గురించి తెలుసుకుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా బ్యాంకు సెలవుల గురించి ఎక్కువగా ట్రెండ్ అవుతుంది.

November Bank Holidays : వచ్చే నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవు.. ఇందులో నిజమెంత?

Bank Holidays

November Bank Holidays : కొత్త నెల ప్రారంభం ముందు చాలామంది బ్యాంకు సెలవుల గురించి తెలుసుకుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా బ్యాంకు సెలవుల గురించి ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. అయితే నవంబర్ లో బ్యాంకుల సెలవుల గురించి కూడా సోషల్ మీడియాలో ఓ ఫోటో సర్క్యులేట్ అవుతుంది. అది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 17 రోజులపాటు బ్యాంకులు పనిచేయవని ట్రెండ్ అవుతున్న ఫోటో సారాంశం. అయితే 17 రోజుపాటు బ్యాంకులు పనిచేయని మాట వాస్తవమే.. కానీ ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల్లో ఉండే పండుగల ఆధారంగా బ్యాంకు సెలవులు ఉంటాయి.

చదవండి : Axis Bank: హోమ్ లోన్స్‌పై యాక్సిస్ బ్యాంక్ 12 నెలల రుణ మాఫీ

ఉదాహరణకు వచ్చేనెలలో కన్నడ రాజ్యజోత్సవం, ఛత్‌ పూజా వంటి పండుగలు ఉన్నాయి. వీటికి కర్ణాటకలో మాత్రమే హాలీడే ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు యధావిధిగా కొనసాగుతాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. దీపావళి, గురునానక్‌ జయంతి/ కార్తిక పూర్ణిమ సందర్భంగా రెండు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. సాధారణ సెలవులు (శని, ఆదివారాలు)తో కలుపుకొని మొత్తంగా 8 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. కాబట్టి ఆయా తేదీలను బట్టి మీ బ్యాంక్‌ పనులను షెడ్యూల్‌ చేసుకోండి..

చదవండి : Banks Holidays: బీ అలర్ట్.. ఈ వారంలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు..!

నవంబర్‌ 4 – దీపావళి (గురువారం), నవంబర్‌ 7 – (ఆదివారం) నవంబర్‌ 13 – (రెండో శనివారం) నవంబర్‌ 14 – (ఆదివారం) నవంబర్‌ 19 – గురునానక్‌ జయంతి/కార్తిక పూర్ణిమ (శుక్రవారం) నవంబర్‌ 21 – (ఆదివారం) నవంబర్‌ 27 – (నాలుగో శనివారం) నవంబర్‌ 28 – (ఆదివారం)