తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

  • Published By: chvmurthy ,Published On : May 10, 2019 / 10:20 AM IST
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.  భానుడి భగ భగలతో  నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. రోహిణి కార్తె  రాక ముందే  రోళ్ళు పగిలే  ఎండలు కాస్తున్నాయి.  ఉదయం ప్రారంభమైన ఎండలు  సాయంత్రం ఆరు గంటలవరకు ప్రభావాన్నిచూపుతున్నాయి.   ఈ తీవ్రత రేపు కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  శుక్రవారం మధ్యాహ్నానికి గంటలకు  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. 

 తెలంగాణ లోని రామగుండం 46, కొత్తగూడెం 46, మహబూబూబాద్ 46, భద్రాచలం 45,నల్గోండ44,ఆదిలాబాద్ 44, వరంగల్ 44,నిజామాబాద్ 43,కరీంనగర్ 43 ,మెదక్ 42  హైదరాబాద్ లో 40,  డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అటు ఏపీ వ్యాప్తంగా చూస్తే..తిరుపతి 45, చిత్తూరు 44, గుంటూరు 44, నెల్లూరు 44,ఏలూరు 44,కడప 44,రాజమండ్రి 43,ఒంగోలు 43,విజయవాడ 42, కర్నూలు 42 ,విజయనగరం  40,శ్రీకాకుళం 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

కాగా…నెల్లూరు జిల్లా వరికుంటపాడు లో అత్యధికంగా 46.74 , గుంటూరుజిల్లావినుకొండలో 46.58, ప్రకాశం జిల్లా ముండ్లమూరులో 46.55 ,కర్నూలు జిల్లా దిన్నదేవర పాడులో 46.12 , డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.  రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు.34 ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు 90 ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల  ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆర్టీజీఎస్ పేర్కోంది.