Chitravathi River : జేసీబీలో చిక్కుకున్న 10 మంది.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

వర్షాల దాటికి అనంతపురం జిల్లాలో ప్రవహించే చిత్రావతి నది ఉగ్రరూపం దాల్చింది. చెన్నేకొత్తపల్లి మండలం వెల్తుర్ది గ్రామం వద్ద చిత్రావతి నదిలో కారు గల్లంతు అయ్యింది.

Chitravathi River : జేసీబీలో చిక్కుకున్న 10 మంది..  కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Chitravathi River

Chitravathi River : ఆంధ్రప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. వర్షాల దాటికి అనంతపురం జిల్లాలో ప్రవహించే చిత్రావతి నది ఉగ్రరూపం దాల్చింది. చెన్నేకొత్తపల్లి మండలం వెల్తుర్ది గ్రామం వద్ద చిత్రావతి నదిలో కారు గల్లంతు అయ్యింది. కారులో ఉన్న నలుగురిని రక్షించేందుకు జేసీబీ తీసుకోని మరో ఆరుగురు వెళ్లారు. వారిని కారులోంచి బయటకు తీశారు కానీ ఒడ్డుకు తీసుకురావడం వీలు కాలేదు. దీంతో మొత్తం 10 మంది జేసీబీలోనే ఉండిపోయారు. వరద ఉదృతి తగ్గితే తప్ప వారిని బయటకు తీసుకొచ్చే మార్గం కనిపించడం లేదు. తాళ్ల సాయంతో.. విద్యుత్ తీగల సాయంతో రక్షించే ప్రయత్నాలు విఫలమయ్యాయి.

చదవండి : Tirumala Ghat Road Restoration : తిరుమల దిగువ ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకల పునరుద్ధరణ

ఈ నేపథ్యంలోనే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సీఎం జగన్‌ని కలిసి విషయం తెలిపారు. విశాఖ, బెంగళూరు నుంచి హెలికాఫ్టర్లు పంపేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు ఎమ్మెల్యే. 10 మందిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ తెలిపారు.

చదవండి : Anantapur Jntu : అనంతపురం జెఎన్ టియులో బీటెక్ అడ్మీషన్స్

నది మధ్యలో చిక్కుకోవడంతో వారిని బయటకు తీసుకురావడం రెస్క్యూ టీమ్ కి కష్టంగా మారింది. మరోవైపు కర్ణాటక సరిహద్దులోని మేల్యా చెరువుకు గండి పడింది. హిందూపురంలోని కొటిపి, పూలమతి, శ్రీకంఠపురం చెరువులు ప్రమాదకరస్థాయిలో ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.