Nara Lokesh Padayatra : లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు.. యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత

నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని నరసింగరాయిని పేటలో అనుమతి లేకుండా లోకేశ్ మీటింగ్ పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్ సహా టీడీపీ నేతలపై 188, 341, 290 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.

Nara Lokesh Padayatra : లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు.. యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత

Nara Lokesh Padayatra : నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని నరసింగరాయిని పేటలో అనుమతి లేకుండా లోకేశ్ మీటింగ్ పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్ సహా టీడీపీ నేతలపై 188, 341, 290 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.

అంతకుముందు సంసిరెడ్డి పల్లెలో కూడా ఉద్రిక్తత ఏర్పడింది. పాదయాత్రలో నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ మాట్లాడుతుండగా.. మైక్ లాక్కున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Also Read..AP Early Elections : 75మంది తిరుగుబాటుకు సిద్ధం, నవంబర్‌లోపే ముందస్తు ఎన్నికలు..! అచ్చెన్న సంచలనం

సంసిరెడ్డిపల్లెలో సుమారు గంటపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల వైఖరిపై మండిపడుతూ.. స్టూల్ పై చాలాసేపు నిల్చుని నిరసన వ్యక్తం చేశారు నారా లోకేశ్. భారత రాజ్యాంగానికి సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా పోలీసులకు చూపించారు. ఇక రాజారెడ్డి రాజ్యాంగం నడవదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు నారా లోకేశ్.

నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు భారీగా మీటింగ్ పెట్టినప్పుడు ఇదే పోలీసులు ఏం చేశారు అని నారా లోకేశ్ నిలదీశారు. వారికో న్యాయం? మాకొక న్యాయమా? అంటూ ఫైర్ అయ్యారు. ఓవైపు లోకేశ్ నిరసన కొనసాగుతుండగానే.. మరోవైపు కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దాదాపు గంటపాటు ఇదే తరహా వాతావరణం కొనసాగింది.(Nara Lokesh Padayatra)

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ లోకేశ్ ముందుకు సాగుతున్నారు. జగన్ పాలన, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు.

Also Read..AP Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతే.. తేల్చి చెప్పిన కేంద్రం, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు

జగన్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ధ్వజమెత్తారు. జే-ట్యాక్స్ కోసం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను వేధిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే పాత పద్ధతిలోనే పదేళ్లకోసారి రెన్యువల్ విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా పోలీసులు కేసులు పెడుతుండడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం నిబంధనలు అతిక్రమించాడని లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటున్నారని నిలదీశారు. బయటికి రాకుండా అందరినీ బెదిరించి చంపేస్తారా? అంటూ మండిపడ్డారు. జగన్ ఓడిపోతారని అన్ని సర్వేలు చెబుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని, ముందస్తు ఎన్నికలు వస్తే రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవడం ఖాయమన్నారు.