chandrababu Naidu : వైసీపీ గూండాల్ని బట్టలిప్పిచ్చి కొట్టిస్తా .. తరిమి తరిమి కొట్టిస్తా : చంద్రబాబు

కర్నూలు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. కొంతమంది చంద్రబాబూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.వైసీపీ గూండాలను బట్టలిప్పించి కొట్టిస్తానని..నాతో పెట్టుకుంటే అదే వారికి చివరి రోజు అవుతుంది అంటూ నిరసనకారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎన్నో చూశానని.. టీడీపీ షోలకు..కార్యక్రమాలకు జనం నుంచి వస్తున్న మంచి స్పందన చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు గూండాలతో తనను రెచ్చగొట్టటానికి యత్నిస్తున్నారని అన్నారు.

chandrababu Naidu : వైసీపీ గూండాల్ని బట్టలిప్పిచ్చి కొట్టిస్తా .. తరిమి తరిమి కొట్టిస్తా  : చంద్రబాబు

Tension in tdp chief chandrababu naidu tour in kurnool district

chandrababu naidu tour in kurnool : కర్నూలు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. కొంతమంది చంద్రబాబూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇదంతా వైసీపీ గూండాలు చేసే పనేనంటూ విరుచుకుపడ్డారు. అంతేకాదు ఎప్పుడూ విచక్షణతో మాట్లాడే చంద్రబాబు కర్నూలు వేదికగా తీవ్ర పదజాలంతో వైసీపీపై విరుచుకుపడ్డారు. వైసీపీ గూండాలను బట్టలిప్పించి కొట్టిస్తానని..నాతో పెట్టుకుంటే అదే వారికి చివరి రోజు అవుతుంది అంటూ నిరసనకారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎన్నో చూశానని.. టీడీపీ షోలకు..కార్యక్రమాలకు జనం నుంచి వస్తున్న మంచి స్పందన చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు గూండాలతో తనను రెచ్చగొట్టటానికి యత్నిస్తున్నారని అన్నారు.

టీడీపీ షోలకు వచ్చే జనప్రభంజనాన్ని చూసి వైసీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అందుకే తనపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. టీడీపీ కార్యకర్తలు సహనంతో వ్యవహరిస్తున్నారని కానీ వారే కన్నెర్ర చేస్తే వైసీపీ నేతలు తోకముడిచి పారిపోతారని అన్నారు. నన్ను చేతలతో..మాటలతో వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారని నన్ను రెచ్చగొడితే వాళ్ల పతనం వారే కొని తెచ్చుకోవటమేనన్నారు. అవసరమైతే మరో నాలుగు రోజులు కర్నూలులోనే ఉండి అందరి సంగతి తేల్చే వెళ్తానంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

వైసీపీ కార్యకర్తలు నాపై విరుచుకుపడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని..కర్నూలు ఎస్సీకి ఐపీఎస్ దండగ అనీ.. ఏపీలో ఐపీఎస్ వ్యవస్థ జగన్ కు ఊడిగం చేస్తోందంటూ విమర్శించారు. 40 ఏళ్లలో కర్నూలుకు చాలాసార్లు వచ్చానని కానీ ఎప్పుడూ లేనంత స్పందన ఇప్పుడు వచ్చిందని ఆ స్పందన చూసి వైసీపీ భరించలేక గూండాలను నాపై ఉసిగొలిపిందని అన్నారు. నేను ఎవ్వరికి భయపడనని..నా జోలికి వచ్చినా నా కార్యకర్తల జోలికి వచ్చినా వైసీపీ గూండాలని బట్టలిప్పించి కొట్టిస్తానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నాశనమైందని వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే ఊడిగం చేస్తూ పోలీసులు వ్యవస్థకే తలవంపులు తెస్తున్నారని ఇది సరైంది కాదన్నారు చంద్రబాబు.

చంద్రబాబును అడ్డుకోవటానికి కొంతమంది చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు బస చేసిన మౌర్య ఇన్ హోటల్ వద్దా..టీడీపీ ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు బస హోటల్ వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వికేంద్రీకరణపై చంద్రబాబు వైఖరి ఏంటో చెప్పాలంటూడిమాండ్ చేశారు.

వికేంద్రీకరణ గురించి నన్ను ప్రశ్నించేవారు జాగ్రత్తగా వినండీ కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని నేనే ప్రతిపాదించానని స్పష్టంచేశారు చంద్రబాబు. ఈ విషయంపై జగన్ ఎప్పుడైనా మాట్లాడారా? కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని ఎప్పుడైనా అడిగాడా? ఆ దిశగా ఎప్పుడైనా యత్నించాడా? అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతే రాజధాని అని జగన్ చెప్పలేదా? అది మీకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. ఇదంతా తెలిసే ఇప్పుడు మాట్లాడుతున్నానని అన్నారు. నిరసనకారుల ముసుగులో ఉన్న వైసీపీ గూండాలు గుర్తు పెట్టుకోండీ మిమ్మల్ని బట్టలిప్పించి కొట్టిస్తా..తరిమి తరిమి కొట్టిస్తానంటూ విరుచుకుపడ్డారు చంద్రబాబు. జగన్ దాదాపు నాలుగేళ్ల పాలనలో ఒక్కరూపాయి అయినా కర్నూలుకు ఖర్చుపెట్టాడా? ఖర్చు పెట్టాడని మీరు చెప్పగలరా? అంటూ సూటిగా ప్రశ్నించారు. నాకు వ్యతరేకంగా నినాదాలు చేసే వైసీపీ గూండాలు రాయలసీమ ద్రోహి ఎవరో తెలుసుకోవాలని ఈ విషయం ప్రజలందరికి తెలుసు..కానీ వైసీపీ గూండాలకు మాత్రం తెలియదు అంటే ఎద్దేవా చేశారు.