AP Govt : కొత్త బార్‌ పాలసీ ప్రకటించిన ఏపీ

నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలో నోటిఫై చేసిన బార్లన్నింటికీ లైసెన్సుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆయా ప్రాంతాలవారీగా వాటి వేలం కోసం అప్‌సెట్‌ ధరను నిర్ణయిస్తారు. అత్యధిక మొత్తం కోట్‌ చేసిన వారికి లైసెన్సు మంజూరుచేస్తారు.

AP Govt : కొత్త బార్‌ పాలసీ ప్రకటించిన ఏపీ

Liquor Policy

AP government : ఏపీ ప్రభుత్వం కొత్త బార్ల విధానాన్ని ప్రకటించింది. ఏపీలోని బార్ల సంఖ్యను పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త బార్‌ పాలసీని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, జిల్లాలు పెరిగినా… బార్ల సంఖ్యను మాత్రం పెంచకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో 840 బార్లు ఉన్నాయి. వాటినే మరో రెండు నెలలు కొనసాగించడానికి నిర్ణయం తీసుకుంది. ఈలోగా బార్ల లైసెన్స్‌లు పొందేందుకు వేలం,లాటరీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులిచ్చారు.

నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలో నోటిఫై చేసిన బార్లన్నింటికీ లైసెన్సుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆయా ప్రాంతాలవారీగా వాటి వేలం కోసం అప్‌సెట్‌ ధరను నిర్ణయిస్తారు. అత్యధిక మొత్తం కోట్‌ చేసిన వారికి లైసెన్సు మంజూరుచేస్తారు. ఆ తర్వాత వారు కోట్‌ చేసిన మొత్తంలో 90శాతం కోట్‌ చేసిన వారికి మిగతా బార్లను కేటాయిస్తారు. 90శాతం కంటే కొద్ది తక్కువగా కోట్‌ చేస్తే, వారు ఆ మొత్తానికి సమానమైన సొమ్ము చెల్లించడానికి అంగీకరిస్తేనే బార్లు కేటాయిస్తారు.

AP Liquor Sales : ఏపీలో మద్యం అమ్మకాల వేళలు కుదింపు

దరఖాస్తు రుసుము కింద 50వేల లోపు జనాభా కలిగిన ప్రాంతాల్లో 5 లక్షలు… 50,001 నుంచి 5 లక్షల లోపు జనాభా ఉంటే ఏడున్నర లక్షలు… 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 10 లక్షలు నిర్ణయించారు. ఈ సొమ్ము తిరిగి చెల్లించరు. నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ రుసుము, లైసెన్సు రుసుములను ఏటా 10శాతం చొప్పున పెంచనుంది ప్రభుత్వం.