AP Govt : మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విలువ ఆధారిత పన్నుల్లో మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది.

AP Govt : మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

Alcohol (1)

revising tax rates on alcohol : మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విలువ ఆధారిత పన్నుల్లో మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది. దేశంలో తయారైన విదేశీ మద్యం బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు చేసింది. రూ.400 వరకు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్ వసూలు చేయనుంది. రూ.400 నుంచి రూ.2,500 వరకు ఉన్న మద్యం కేసుపై 60 శాతం వ్యాట్ వసూలు చేయాలని నిర్ణయించింది.

రూ.2,500 నుంచి 3,500 వరకు మద్యం కేసుపై 55 శాతం వ్యాట్, రూ.3,500 నుంచి రూ.5 వేల వరకు మద్యం కేసుపై 50 శాతం వ్యాట్ వసూలు చేయనుంది. రూ.5 వేలు ఆపై ధర పలికే మద్య కేసుపై 45 శాతం వ్యాట్ వసూలు చేయాలని నిర్ణయించింది.

Bail To Shivalinga Prasad : హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ కు బెయిల్

దేశీయంగా తయారై ప్యాకింగ్ చేసిన బీర్ల కేసుపై రూ.200 కంటే ధర తక్కువ ఉన్న వాటిపై 50 శాతం వ్యాట్, రూ.200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేసుపై 60 శాతం వ్యాట్, అన్ని రకాల వైన్ మద్యంపై 35 శాతం వ్యాట్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెడీ టు డ్రింక్ వెరైటీలన్నింటిపైనా 50 శాతం వ్యాట్ విధించాలని నిర్ణయిచింది.