కాకినాడ సెజ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం..సెజ్ కోసం సేకరించిన 2,180 ఎకరాలు వెనక్కి

కాకినాడ సెజ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం..సెజ్ కోసం సేకరించిన 2,180 ఎకరాలు వెనక్కి

AP government a key decision : తూర్పు గోదావరి జిల్లా రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాకినాడ సెజ్‌కు రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ సెజ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సెజ్ కోసం రైతుల నుంచి సేకరించిన 2వేల 180 ఎకరాల భూమిని వెనక్కి ఇచ్చేయాలని కేబినెట్ భేటీలో డిసిషన్ తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

కాకినాడ సెజ్ దేశంలోనే పెద్దదని మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ సెజ్ ఏర్పాటు కోసం ఆరు గ్రామాలను ఖాళీ చేయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. కాకినాడ సెజ్ పేరుతో 2005 నుంచి చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా కొందరు రైతులు 16 ఏళ్లుగా పోరాడుతున్నారన్నారు. గత ప్రభుత్వాలు రైతులపై ఉక్కుపాదం మోపి భూములు తీసుకున్నాయని.. రైతుల అభిప్రాయం తీసుకుని సీఎంకు నివేదిక ఇచ్చామని మంత్రి తెలిపారు.

స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే రాష్ట్ర చట్టాన్ని కూడా సెజ్‌లో అమలు చేసేందుకు అంగీకారం కుదిరిందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. అయితే, సెజ్ రైతులను ఆదుకుంటానని ఎన్నికలకు ముందు సీఎం జగన్ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్పింది.