Home » Andhrapradesh » రాష్ట్ర బంద్ కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం
Updated On - 4:26 pm, Thu, 4 March 21
AP state bandh : విశాఖ స్లీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రేపు ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. రాష్ట్ర బంద్ కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం తెలుపుతున్నట్లు గురువారం (మార్చి 4, 2021) మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడుతూ రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయనున్నట్లు చెప్పారు.
ఒంటి గంట తర్వాత నల్ల బ్యాడ్జీలతో విధులకు ఆర్టీసీ కార్మికులు కానున్నారని పేర్కొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలుపుతారని చెప్పారు. రేపటి ఏపీ బంద్ కు వైసీపీ సహకరిస్తోందని తెలిపారు. తెలుగు వాళ్ల పోరాట ఫలితం విశాఖ ఉక్కు అని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రజల ఆస్తిగానే ఉంచాలన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఏపీలో గత కొద్ది రోజులుగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలనే లక్ష్యంతో పోరాడుతున్నారు. ఇందులో భాగంగానే రేపు ఏపీ రాష్ట్ర బంద్ తలపెట్టారు.
బయోటెక్నాలజీ-రూ.37వేల 400, కెమిస్ట్రీ-రూ.33వేలు.. పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఖరారు
నాగబాబుకు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్
AP Government : వాలంటీర్లకు మనసారా సెల్యూట్ : సీఎం జగన్
ఒక్కొక్కరికి రూ.7,500.. మే 13న వారి ఖాతాల్లోకి డబ్బులు
Smart Towns : ఒక కుటుంబానికి ఒకటే.. వార్షికాదాయం రూ.18 లక్షలలోపే.. స్మార్ట్టౌన్లలో ప్లాట్ల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు
Perni Nani on Vakeel Saab : వకీల్ సాబ్ పై మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్