AP High Court : అమరావతి రైతులు వేసిన పిటిషన్‌ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి

తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.

AP High Court : అమరావతి రైతులు వేసిన పిటిషన్‌ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి

High Court

Amaravati farmers petition filed : తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం రేపు విచారణ చేపట్టనుంది. నిన్న అమరావతి పరిరక్షణ సమితి ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తిరుపతిలో నిర్వహించాలనుకుంటున్న రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరింది. సభకు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం అడ్డుపడుతోందని పిటిషన్‌లో రైతుల తరఫు న్యాయవాది లక్ష్మినారాయణ హైకోర్టుకు వెల్లడించారు.

తిరుపతిలో రాజధాని రైతుల సభకు అనుమతివ్వకుండా పోలీసులు అసంబద్ధ కారణాలు చూపుతున్నారన్నారని పేర్కొన్నారు. డీజీపీ.. మహా పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారని కోర్టుకు వెల్లడించారు. సభకు అనుమతి ఇవ్వాలా?…వద్దా? అనేది నిర్ణయించాల్సింది జిల్లా ఎస్పీ అని, అలాంటిది సభపై ఓ డీఎస్పీ అధికారి నిర్ణయం ఎలా తీసుకుంటారని న్యాయవాది లక్ష్మినారాయణ రిట్ పిటిషన్‌లో ప్రశ్నించారు. అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై కోర్టు రేపు విచారణ చేపట్టనుంది.

Amaravati Farmers : ముగిసిన అమరావతి రైతుల పాదయాత్ర..రేపు శ్రీవారిని దర్శించుకోనున్న అన్నదాతలు

అమరావతి రైతుల పాదయాత్ర ముగిసింది. అలిపిరి వద్దకు చేరుకున్న అమరావతి రైతులు..గరుడ విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి యాత్ర ముగించారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట…నవంబర్ 1న అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. 44 రోజుల పాటు 400 కిలో మీటర్లకు పైగా పాదయాత్ర సాగింది. ఇవాళ సాయంత్రం రైతుల పాదయాత్ర.. అలిపిరి వద్ద ముగిసింది. మహాపాదయాత్రలో పాల్గొన్న అమరావతి రైతులు.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల టీటీడీ అనుమతి ఇచ్చింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని స్పష్టం చేసింది.

రేపు ఒక్కరోజే మొత్తం 500 మంది దర్శనానికి అనుమతి లభించింది. అమరావతి రైతులు రేపు కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అమరావతి రైతులకు రేపు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టీటీడీ మంజూరు చేసింది. రేపు ఉదయం కాలినడకన అమరావతి రైతులు తిరుమల చేరుకోనున్నారు. పాదయాత్రలో పాల్గొన్న 500 మంది రైతులకు శ్రీవారి దర్శనం కల్పించాలని అన్నదాతులు విజ్ఞప్తి చేశారు. దీనిపై టీటీడీ సానుకూలంగా స్పందించింది. రేపు 500 మంది రైతులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం అవకాశం కల్పించింది.

Lakhimpur Kheri : రైతులపై కావాలనే కారు ఎక్కించారు… పక్కా ప్రణాళికతోనే లఖింపూర్ ఖేరీ దాడి జరిగిందన్న సిట్

అంతకముందు అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం రేపింది. మూడు రాజధానులే కావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని జనసేన, టీడీపీ నేతలు చించివేశారు. అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో తిరుపతిలో ప్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న మార్గంలోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

‘మీతో మాకు గొడవలు వద్దు… మీకు మా స్వాగతం, మాకు మూడు రాజధానులే కావాలి’ అంటూ తిరుపతి ప్రజల పేరిట నగరంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అయితే మూడు రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని జనసేన, టీడీపీ నేతలు చించివేశారు. పాదయాత్రను నీరు గార్చేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు.