AP High Court : విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ మాజీ సీబీఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ.. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరుపున న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు.

AP High Court : విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ

AP High Court

AP High Court : విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ మాజీ సీబీఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ.. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరుపున న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం పాటించకుండా ముందుకు వెళుతోందని న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించారు.

9 వేల 200 మంది రైతులు భూములు కోల్పోయి.. నాలుగవ తరం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే.. ఉద్యోగ భద్రత కల్పించకుండా కేంద్రం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరుపు న్యాయవాది న్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలించకుండా.. ప్రైవేటీకరణకు వెళ్లడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

Vizag Steel Plant : రూ.900కోట్ల లాభం.. అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో మార్పు లేదు -తేల్చి చెప్పిన కేంద్రం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం ముందుకు వెళ్లకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ ధాఖలు చేయాలని ఆదేశించింది. తుది విచారణను సెప్టెంబర్ 21కు వాయిదా వేసింది.