AP High Court : ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించింది. ఉద్యోగుల సర్వీస్ అంశాలకు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఆక్షేపిస్తూ ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

AP High Court : ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు

AP High Court

AP High Court : ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించింది. ఉద్యోగుల సర్వీస్ అంశాలకు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఆక్షేపిస్తూ ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. విద్యాశాఖలో సర్వీస్ అంశంలో తమ ఆదేశాలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం చేసింది. ఇద్దరు ఉన్నతాధికారులు రాజశేఖర్, రామకృష్ణకు 2 నెలల జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధించింది.

అధికారులను తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశాలు జారీ చేసింది.ఏపీలో ప్రభుత్వం ఉద్యోగుల సర్వీస్ అంశాలకు సంబంధించిన విషయమై ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేయకపోవడంతో బుధవారం ఏపీ హైకోర్టులో మళ్లీ వాదనలు జరిగాయి.

AP High Court : సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఇంతకముందు ఇచ్చిన హైకోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదంటూ ధర్మాసనం ప్రశ్నించింది. తీర్పును అమలు చేయకపోవడంతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణకు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇద్దరు అధికారులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.